ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటన ఖరారైంది. మెస్సీ పర్యటన ఖరారైన సందర్భంగా ఆయన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్‌కు తన సంతకం చేసిన ఫుట్‌బాల్‌ను బహుమతిగా పంపారు. ఈ విషయాన్ని ఫడ్నవీస్ స్వయంగా తన ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
డిసెంబర్ 14, 2025న మెస్సీ తన గోట్ టూర్‌లో భాగంగా ముంబైకి రానున్నారు. 2011 తర్వాత మెస్సీ భారత్‌కు రావడం ఇదే మొదటిసారి. 14 ఏళ్ల తర్వాత రానుండంతో ఫుట్‌బాల్ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 14 ఏళ్ల తర్వాత భారత్‌కు రాబోతున్నారు. గతంలో 2011లో కోల్‌కతాలో జరిగిన ఒక ఫ్రెండ్లీ మ్యాచ్ కోసం మెస్సీ భారత్‌కు వచ్చారు.