ఫుట్‌బాల్ ప్లేయర్ క్లింటన్ ఎన్జీ వివాదంలో చిక్కుకున్నాడు. రష్యాకు చెందిన డైనమో మాస్కో క్లబ్ క్లింటన్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. రష్యన్ క్లబ్‌తో భారీ డీల్ కుదరడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ఆ ఆనందంలో ఫూటుగా మందుకొట్టి ఓ యువతితో శృంగారంలో పాల్గొన్నాడు. ఇంకా ఈ వ్యవహారాన్ని స్నాప్ చాట్‌లోని లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్ ద్వారా ప్రపంచం మొత్తం చూసేలా చేశాడు.
అతడి శృంగారానికి సంబంధించిన దృశ్యాలు నెట్‌లో వైరల్ కావడంతో నెటిజన్లు అతనిపై దుమ్మెత్తి పోశారు. వెంటనే స్నాప్ చాట్‌లోని వీడియో పుటేజిని తొలగించాడు.
అనంతరం తాను రష్యాతో ఒప్పందం కదుర్చుకున్న విషయాన్ని నెటిజన్లతో పంచుకోబోయి పొరపాటున లైవ్‌స్ట్రీమ్‌ను ఓపెన్ చేసినట్టు తెలిపాడు. తాగి వుండటంతోనే ఫోనులో లైవ్ స్ట్రీమ్ బటన్‌ను ప్రెస్ చేశాననని క్షమాపణలు చెప్పాడు.