Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బెంగుళూరును ముంచెత్తిన భారీ వర్షం - ఆసియా నెట్‌బాల్ మ్యాచ్ వాయిదా

rain

సెల్వి

, మంగళవారం, 22 అక్టోబరు 2024 (14:17 IST)
బెంగుళూరు నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. దీంతో కోర్మంగళ ఇండోర్ స్టేడియం ఆవరణలోకి నీరు చేరింది. ఈ కారణంగా ఆసియా నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ వాయిదా పడింది. భారీ వర్షం కారణంగా రాజకాలువే నీరు రోడ్డుపై ప్రవహించి స్టేడియం ఆవరణలోకి చేరింది. ఉదయం వరదలు, విద్యుత్ సమస్య కారణంగా సోమవారం జరగాల్సిన రెండు మ్యాచ్‌లు గురువారానికి వాయిదా వేశారు. గేటు నుంచి స్టేడియం వరకు నీరు నిలిచిపోవడంతో హోటల్‌లో బస చేసిన ఆటగాళ్లను బస్సులో తీసుకురావడానికి ఇబ్బందిగా మారింది.
 
ఆసియా నెట్‌బాల్ ఛాంపియన్‌షిప్ 13వ ఎడిషన్ అక్టోబర్ 18న ప్రారంభమై అక్టోబరు 27న ముగుస్తుంది. మొత్తం 14 జట్లకు చెందిన 300 మందికి పైగా అథ్లెట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. మాల్దీవులు, సౌదీ అరేబియా, శ్రీలంక, మలేషియా, ఫిలిప్పీన్స్, భారత్, జపాన్, సింగపూర్, హాంకాంగ్, బ్రూనై, థాయ్‌లాండ్, చైనీస్ తైపీ, ఇరాక్ బహ్రెయిన్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నాయి. 
 
ఆదివారం రాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు కురిసిన భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. ఉరుములతో కూడిన భారీ వర్షం బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అనేక అవాంతరాలు సృష్టించింది. గాలి ఆంజనేయ ఆలయం పరిసర ప్రాంతాలు మోస్తరు వర్షానికే నీట మునిగిపోతున్నాయి. వర్షం పడితే ఆలయ ఆవరణలోకి వర్షం నీరు వచ్చి చేరుతుంది. ఆదివారం వర్షం కురిసినా ఆలయం వెలుపలి భాగం నీటితో నిండిపోవడంతో పాటు వర్షం ఆగినా ఆలయం వెలుపల ప్రధాన రహదారిపై వర్షం నీరు నిలిచి వాహనదారులకు సైతం ఇబ్బంది కలిగిస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కొన్నిసార్లు మౌనంగా ఉండిపోవడం మంచిది.. రిషబ్ పంత్ ట్వీట్...