చెన్నైలోని ప్రధాన ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఐటీ సంస్థలు ఎక్కువగా వుండే తరమణి, వేలచ్చేరి ప్రాంతాల్లో వేలాది ఇళ్లు నీట మునిగాయి. భారీ వర్షాల కారణంగా 11 సబ్ వేలను మూసివేశారు. అలాగే మెట్రో రైలు తాత్కాలికంగా రద్దు చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 
 
 			
 
 			
					
			        							
								
																	
	 
	బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాజధాని నగరం చెన్నై సహా నాలుగు జిల్లాలోనూ సోమవారం రాత్రి ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. మంగళవారం ఉదయం మరింత తీవ్ర రూపం దాల్చటంతో నాలుగు జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. 
	 
	నగరంలో మంగళవారం వేకువజామున పెనుగాలులకు నగరంలో మూడు ప్రాంతాల్లో చెట్లు కూలిపడ్డాయి. చెన్నై, తిరువళ్లూరు, చెంగల్పట్టు, కాంచీపురం జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదు కావడంతో పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి.