Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ, అంతర్జాతీయ స్థాయి మహిళా అథ్లెట్లకు మద్ధతుగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ పరివర్తన్ స్కాలర్‌షిప్‌లు

Advertiesment
cash
, శనివారం, 4 జూన్ 2022 (22:51 IST)
హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సంయుక్తంగా నేడు మహిళా క్రీడాకారిణులకు అలాగే తర్ఫీదుదారులకు, ‘‘అన్‌స్టాపబుల్- కర్‌కే దిఖావూంగీ’’ అనే రెండు దశల స్కాలర్‌షిప్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఈ కార్యక్రమం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సామాజిక కార్యక్రమాల బ్రాండ్ పరివర్తన్‌లో భాగంగా నిర్వహిస్తుండగా, దేశ వ్యాప్తంగా ప్రతిభావంత క్రీడాకారిణులను గుర్తించి, వారి క్రీడా శ్రేష్ఠత ప్రయాణంలో మద్ధతుగా నిలుస్తుంది.

 
గోస్పోర్ట్స్ ఫౌండేషన్ రూపొందించిన ఈ కార్యక్రమం భారతదేశంలోని క్రీడల్లో మహిళలు ఎక్కువ సంఖ్యలో పాల్గొనేందుకు ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఈ ఫౌండేషన్ 3 ఏళ్ల వరకు ప్రత్యేక భాగస్వామిగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకుతో ఈ కార్యక్రమాన్ని రూపొందించి, అమలు చేస్తుంది. భారతదేశంలో మహిళా క్రీడాకారిణులు సరైన మౌలిక సదుపాయాల కొరత, ఆర్థిక పారితోషిక అవసరం, నిర్బంధాలను విధించే సాంస్కృతిక కట్టుబాట్లు తదితర పలు సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఈ సవాళ్లను ఎదుర్కొనే లక్ష్యాన్ని ఈ కార్యక్రమం చేస్తుంది. వారి పోటీ మరియు ప్రయాణం, శిక్షణ, సాధన, కోచింగ్ మరియు క్రీడా విజ్ఞానపు అవసరాలకు మద్ధతు ఇవ్వడమే కాకుండా ఈ కార్యక్రమం భారతీయ క్రీడా రంగంలో సమాజానికి కొత్త మహిళా ఛాంపియన్లను మరియు ఆదర్శంగా నిలిచే వ్యక్తులను సృష్టించడం ద్వారా సమానత్వం మరియు కలుపుకుని వెళ్లడాన్ని వృద్ధి చేసే దిశలో శ్రమిస్తుంది.
 
ఈ కార్యక్రమం ప్రతిభావంతులైన రాష్ట్ర మరియు జాతీయ స్థాయి క్రీడాకారిణులను ఒలంపింక్, ప్యారా ఒలంపిక్, శీతాకాలపు క్రీడలు మరియు మోటార్ స్పోర్ట్స్ విభాగాల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఇది వైవిధ్యమయమైన రంగంలోకి క్రీడాకారిణులకు వారి క్రీడా సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించేందుకు మద్ధతుగా నిలిచే లక్ష్యాన్ని కలిగి ఉంది. మే 24 నుంచి జూన్ 24, 2022 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఎంపికైన క్రీడాకారిణులు అంతర్గత మూల్యాంకనలకు మరియు తదుపరి దశలకు ఎంపిక చేసుకునేందుకు పిలుస్తారు. ఇందులో తర్ఫీదుదారులు మరియు నిపుణుల ఫీడ్‌బ్యాక్, ఇంటర్వ్యూ రౌండ్లు మరియు వివేచన కలిసి ఉంటాయి. క్రీడాకారిణుల ఎంపిక ప్రక్రియ 100 రోజులు పడుతుంది.
 
చివరిగా 20 మంది క్రీడాకారిణులకు స్కాలర్‌షిప్ ఇస్తారు. వారి క్రీడా రంగంలోని ప్రయాణంలో సమగ్రమైన మద్ధతు అలాగే వారి వృత్తిలో అభివృద్ధికి ప్రముఖ దశల్లో మద్ధతు ఇస్తారు. ఈ ప్రక్రియ ద్వారా మూడవ రౌండులో ఎంపికైన 100 మంది క్రీడాకారిణులకు ఏడాది మొత్తం వారికి సంబంధించిన పలు అంశాలపై విద్యా సంబంధిత కార్యశాలలను నిర్వహిస్తారు. కార్యక్రమం రెండవ దశలో దరఖాస్తులను కోచ్‌లు అలాగే వార్షిక స్కాలర్‌షిప్‌లకు అందుబాటులో ఉంచుతారు. క్రీడాకారుల తరహాలోనే వారికి వారి ప్రగతి మరియు అభివద్ధికి ఆర్థిక అలాగే ఆర్థికేతర మద్ధతు ఇస్తారు.
 
ఈ కార్యక్రమం క్రీడాకారులకు సగటున ఏటా రూ.5-10 లక్షల ఆర్థిక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. కోచ్‌లకు రూ.5 లక్షల స్కాలర్‌షిప్‌లను ఇస్తుంది. ‘‘సామాజికంగా బాధ్యతాయుత కార్పొరేట్ పౌరునిగా మేము దేశంలోని క్రీడా ప్రతిభలను పోషించేందుకు అనుగుణంగా మా మద్ధతును విస్తరించాలని కోరుకుంటున్నాము’’ అని హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు సిఎస్ఆర్, బిజినెస్ ఫైనాన్స్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ హెడ్ అశిమా భట్ తెలిపారు. ‘‘క్రీడలు మన దేశంలో యువత సమగ్ర అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఈ ప్రతిభావంత క్రీడాకారులకు తగిన వనరులు మరియు మౌలిక సదుపాయాల కొరత వారి శ్రమను వేగంగా వదిలిపెట్టేలా ఒత్తిడి పెంచుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ కొన్ని అంతరాలను భర్తీ చేసేలా డిజైన్ చేశాము మరియు మన క్రీడాకారిణులు మరియు తర్ఫీదుదారులు వారి రంగాల్లో శ్రేష్ఠతను సాధించవచ్చు. ప్రతిభను ఆవిష్కరించడం మరియు వారికి దేశం మరియు అంతర్జాతీయ వేదికల్లో మహోన్నతమైన సాధనను ప్రదర్శించేందుకు అవకాశం కల్పించడమే మా ఉద్దేశం’’ అని వివరించారు.
 
‘‘#పరివర్తన్ మా అగ్రగామి సిఎస్‌ఆర్ కార్యక్రమం కాగా, సమాజంలో మంచిని తీసుకు వచ్చేందుకు ఉత్ప్రేరకంగా పని చేస్తుంది’’ అని సిఎస్ఆర్ హెడ్ నుస్రత్ పఠాన్ తెలిపారు. ‘‘క్రీడాకారులు ఎదుర్కొనే మౌలిక సదుపాయాల కొరతల మధ్య కూడా మహిళలు క్రీడల్లో సామాజిక మరియు సాంస్కృతిక నిర్బంధాల అదనపు భారాన్నీ ఎదుర్కొనవలసి వస్తుంది. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌తో ఎక్కువ సమానత మరియు ఇన్‌క్లూజన్‌ను ఈ రంగానికి తీసుకు వచ్చేందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. ఇది పరివర్తన్  కార్యక్రమం విస్తృత వ్యూహాత్మక లక్ష్యాలకు అనుగుణంగా ఉంది’’ అని వివరించారు.
 
ఈ ప్రారంభం గురించి గోస్పోర్ట్స్ ఫౌండేషన్ సీఈఓ దీప్తి బోపయ్య మాట్లాడుతూ, ‘‘దశాబ్దాల నుంచి మహిళా క్రీడా ఛాంపియన్లకు పలు ప్రత్యేక మైలురాళ్లను సృష్టించగా, వారు చరిత్ర నిర్మించి, మూసపోత ధోరణులను మార్చడంలో, అడ్డంకులను అధిగమించడంలో మరియు క్రీడల ద్వారా సముదాయాల్లో స్ఫూర్తి నింపడంలో తమదైన ముద్ర వేశారు. గోస్పోర్ట్స్ ఫౌండేషన్‌లో మేము గత 13 ఏళ్ల నుంచి భవానీ దేవి, దీపా కర్మార్కర్, అవని లేఖరా తదితరుల ప్రయాణాల్లో భాగం అయి ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. క్రీడల్లో బాలికలు మరియు మహిళలకు ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగమయ్యేందుకు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు చేరడం మాకు మరింత ఉత్సాహాన్ని తీసుకు వచ్చింది. మేము ఇక్కడ వారి క్రీడా ప్రయాణాల్లో వారి సమగ్ర అభివృద్ధిపై దృష్టి సారిస్తాము. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మరియు వారి కథలను మార్చడాన్ని కొనసాగించేందుకు చాలా సంతోషిస్తున్నాము’’ అని తెలిపారు.
 
ఈ కార్యక్రమం రుతుచక్రపు ఆరోగ్యం మరియు పరిశుభ్రత, క్రీడల్లో విరామానికి అలాగే పునశ్చేతనకు మానసిక ఆరోగ్యం మరియు సురక్షిత ప్రాంతాలు, పరిశోధన, ఔట్‌రీచ్ మరియు అడ్వకసీల ద్వారా లైంగిక వేధింపులకు అడ్డుకట్ట (POSH) మరియు క్రీడారంగంలో ఉన్న మహిళలకు క్రీడల గురించి మరో రెండో ఆలోచన లేకుండా వృద్ధిలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంచుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రధాని మోదీతో ప్రపంచ మహిళా బాక్సింగ్ చాంపియన్ నిఖత్ జరీన్ సెల్ఫీ