Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఫుట్‌బాల్ ఆటగాడిపై యువతుల లైంగిక దాడి.. ఇంటికితీసుకెళ్లి మద్యం తాపించి గుండుగీశారు...

బ్రిటన్‌లో ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై ముగ్గురు మహిళలు లైంగిక దాడికి తెగబడ్డారు. ఆ క్రీడాకారుడిని మాటలతో మెస్మరైజ్ చేసి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పీకల వరకు మద్యం తాపించి, దుస్తులు తొలగించి లైంగి

Advertiesment
Girls sexually assault
, శుక్రవారం, 16 డిశెంబరు 2016 (15:10 IST)
బ్రిటన్‌లో ఓ ఫుట్‌బాల్ క్రీడాకారుడిపై ముగ్గురు మహిళలు లైంగిక దాడికి తెగబడ్డారు. ఆ క్రీడాకారుడిని మాటలతో మెస్మరైజ్ చేసి తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ తర్వాత పీకల వరకు మద్యం తాపించి, దుస్తులు తొలగించి లైంగిక దాడికి తెగబడ్డారు. ఈ కేసు విచారణ ఇటీవలే పూర్తి కావడంతో ఈ వివరాలు బహిర్గతమయ్యాయి. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
బ్రిటన్‌కి చెందిన 20 యేళ్ల ఫుట్‌బాల్ క్రీడాకారుడిని ఓ నైటవుట్ కార్యక్రమంలో బ్రోగాన్ గిల్లార్డ్ (26), పైగే కున్నిఘామ్ (22), షానన్ జోన్స్ (20) అనే ముగ్గురు యువతులు కలుసుకున్నారు. ఆ తర్వాత తమ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ అతడితో బలవంతంగా మద్యం తాగించారు. అతడు మత్తుగా పడిపోయిన తర్వాత వస్త్రాలు తొలగించి లైంగిక దాడికి దిగారు.
 
ఆతర్వాత చాకు తీసుకుని అతడి ఛాతీపై ఉల్లిపాయలు, కూరగాయలు తరిగారు. మ్యూజిక్ పెట్టుకుని అతడి చుట్టూ తిరుగుతూ పిచ్చిగా డ్యాన్స్ చేశారు. గిల్లార్డ్ అనే అమ్మాయి బాధితుడికి బోడిగుండు కూడా చేసింది. ఈ మొత్తం దారుణాన్ని ఆ యువతులు వీడియో కూడా తీసుకున్నారు. అదే ఇప్పుడు కోర్టులో బలమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ కేసు విచారణ తాజాగా పూర్తికాగా, వీరికి ప్రెస్టన్ క్రౌన్ కోర్టు శిక్షా కాలాన్ని ఖరారు చేయనుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇంగ్లండ్-భారత్ టెస్టులకు చెన్నై వేదికవుతుందా? కోహ్లీ చేతుల మీదుగా అనయకు జెర్సీ?