Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇంగ్లండ్-భారత్ టెస్టులకు చెన్నై వేదికవుతుందా? కోహ్లీ చేతుల మీదుగా అనయకు జెర్సీ?

ఇంగ్లండ్-భారత్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో టెస్టు సారథి విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వాంఖడే మైదానంలో జరిగిన ఈ టెస్టు సందర్భంగా ఫ్యాన్స్ కోసం న

Advertiesment
Team India finds out the new 12th man for each day
, మంగళవారం, 13 డిశెంబరు 2016 (16:06 IST)
ఇంగ్లండ్-భారత్‌ల మధ్య జరిగిన నాలుగో టెస్టులో టెస్టు సారథి విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకుని డబుల్ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. వాంఖడే మైదానంలో జరిగిన ఈ టెస్టు సందర్భంగా ఫ్యాన్స్ కోసం నిర్వాహకులు ఓ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్‌ ఇంకా ఒక మ్యాచ్‌ మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను కైవసం చేసుకున్న నేపథ్యంలో... ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో చివరి టెస్టు ఈ నెల 16 నుంచి చెన్నైలో జరగనుంది. వార్ధా తుఫాను నేపథ్యంలో ఈ మ్యాచ్‌కు సత్వర ఏర్పాట్లు చేయనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. 
 
నాలుగో టెస్టు రెండో రోజు నుంచి ఈ కార్యక్రమం చేపట్టారు. మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చినవారి నుంచి చిన్నారులను ఎంపిక చేసి టీమిండియా జట్టులో 12వ సభ్యుడిగా పేర్కొంటూ వారికి టీమిండియా జెర్సీని అందించారు. ఈ క్రమంలో నాలుగో టెస్టు రెండో రోజు ఆట ముగిసిన తర్వాక పార్థీవ్ పటేల్ చేతుల మీదుగా, 8సంవత్సరాల కవలలు వివాన్‌, విశ్మే టీమిండియా జెర్సీలను అందుకున్నారు.
 
అలాగే మూడో రోజు ఆట ఆట అనంతరం శతకం నమోదు చేసిన విజయ్‌ చేతులమీదుగా ఐదేళ్ల చిన్నారి ధృవ, నాలుగో రోజు ఆట అనంతరం జయంత్‌ యాదవ్‌ చేతులమీదుగా తొమ్మిదేళ్ల అనయ భన్సాల్‌ టీమిండియా జెర్సీలను అందుకున్నారు. నాలుగో టెస్టు ఐదో రోజు ఆట ముగిసిన అనంతరం భారత టెస్టు జట్టు సారథి విరాట్‌ కోహ్లీ చేతులమీదుగా ఎనిమిదేళ్ల అనయ జైన్‌ టీమిండియా జెర్సీని అందుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్యాటింగ్ మెళకువలు నాకేం తెలియవు : విరాట్ కోహ్లీ