Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్యాటింగ్ మెళకువలు నాకేం తెలియవు : విరాట్ కోహ్లీ

బ్యాటింగ్ మెళకువులు తనకు పెద్దగా తెలియవని భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ టెక్నిక్ అంతగా గొప్పగా ఏమీ లేదంటూ ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ వ్యాఖ్యాన

Advertiesment
Virat Kohli
, సోమవారం, 12 డిశెంబరు 2016 (16:07 IST)
బ్యాటింగ్ మెళకువులు తనకు పెద్దగా తెలియవని భారత టెస్ట్ క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ అభిప్రాయపడ్డారు. బ్యాటింగ్ టెక్నిక్ అంతగా గొప్పగా ఏమీ లేదంటూ ఇంగ్లండ్ ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ వ్యాఖ్యానించడంపై విరాట్ కోహ్లి స్పందించాడు. 
 
ముంబైలో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్ట్ నాలుగో రోజు ఆటలో భాగంగా ఆదివారం మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. అసలు అండర్సన్ ఏదైతే విమర్శించాడో, అది తనకు ఆఖరి రోజు మ్యాచ్ చివర్లోనే తెలిసిందన్నాడు. దానికి తాను ఒకింత నవ్వుకున్నట్లు తెలిపాడు. వారిద్దరూ మాటల యుద్ధానికి తెరలేపినప్పడే తాను వెళ్లిన సంగతిని విరాట్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
 
ఇదిలావుంచితే ఈ సిరీస్ విజయం అత్యంత మధురమని విరాట్ వ్యాఖ్యానించాడు. ఇటీవల తాము సాధించిన సిరీస్ విజయాలకంటే ఇదే ఎక్కువగా సంతృప్తి కలింగిచిందన్నాడు. ఇదొక ప్రత్యేక అనుభూతిని మిగిల్చిన సిరీస్‌గా అనిపిస్తుందన్నాడు. ఈ సిరీస్ విజయానికి సమష్టి కృషే కారణమని విరాట్ పేర్కొన్నాడు.
 
భారత్ గెలుపు సాధించడానికి స్లో పిచ్‌లే కారణమంటూ ధ్వజమెత్తాడు. అసలు ఎటువంటి పేస్‌కు అనుకూలించని పిచ్‌లను తయారు చేయడంతోనే తాము ఘోరంగా ఓటమి పాలైనట్లు అండర్సన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత్ పిచ్‌ల్లో సాంకేతికంగా పాటించాల్సిన కొన్ని పద్ధతుల్ని పాటించలేదని విమర్శించాడు. అది విరాట్ కోహ్లి గేమ్ ప్లాన్‌లో భాగంగానే జరిగిందంటూ వ్యాఖ్యానించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ముంబై టెస్ట్ : ఇంగ్లండ్‌ను చుట్టేసిన స్పిన్నర్లు.. భారత్ ఘన విజయం