ఆంధ్రప్రదేశ్‌లో ఫార్ములా త్రీ కార్ రేసింగ్...
ఫార్ములా త్రీ... ఓ కలల ప్రాజెక్టు. ఇప్పుడు అమరావతి రేస్ రిసార్ట్ ప్రాజెక్టు రూపంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌లో సాకారం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఫార్ములా వన్‌కు ప్రతి రూపంగా వేగం విషయంలో స్వల్ప మార్పులతో ఇప్పుడది ఫార్ములా త్రీ అయ్యింది. రయ్యిన
ఫార్ములా త్రీ... ఓ కలల ప్రాజెక్టు. ఇప్పుడు అమరావతి రేస్ రిసార్ట్ ప్రాజెక్టు రూపంలో స్వర్ణాంధ్రప్రదేశ్‌లో సాకారం అయ్యేందుకు సిద్ధం అవుతోంది. ఫార్ములా వన్‌కు ప్రతి రూపంగా వేగం విషయంలో స్వల్ప మార్పులతో ఇప్పుడది ఫార్ములా త్రీ అయ్యింది. రయ్యిన దూసుకుపోయే కార్లు... అందుకోసమే ప్రత్యేకంగా రూపొందించిన కిలో మీటర్ల ట్రాక్... ఇప్పుడు పర్యాటకాంధ్రప్రదేశ్‌లో దర్శనం ఇవ్వబోతున్నాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడు రాష్ట్రానికి ఫార్ములా వన్ తీసుకు వచ్చేందుకు చేసిన ప్రయత్నం ఈ రూపంలో సఫలం కానుంది.
ఇందుకోసం పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ప్రాజెక్టును సిద్దం చేసారు. అనంతరపురం జిల్లా కోటపల్లి గ్రామంలో ఇందుకు అవసరమైన భూమిని గుర్తించగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయిడి అనుమతి తీసుకునే క్రమంలో అన్ని పనులు వేగంగా జరిగిపోతున్నాయి.
ప్రభుత్వ ప్రవేటు భాగస్వామ్యంలో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తుండగా, దేశీయంగా నిధి మార్క్‌క్యూ ఒన్ మోటార్స్ ప్రాజెక్టుకు నేతృత్వం వహించనుంది. అంతర్జాతీయ స్ధాయిలో డ్రైవెన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, మోటార్ స్పోర్ట్ ఫార్ములా అపరేటర్స్ వంటి సంస్ధల సహకారంతో ఈ ఫార్ములా త్రీ ప్రాజెక్టును పూర్తి చేయాలని పర్యాటక శాఖ భావిస్తోంది. సాధారణంగా ఫార్ములా వన్ స్ధాయిలో కార్ల వేగం 350 నుండి 400 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉండగా, ఫార్ములా త్రీలో అది గంటకు 250 కిలోమీటర్లకే పరిమితం అవుతుంది.
దాదాపు 3.3 కిలో మీటర్ల మేర కార్ రేసింగ్ కోసం ప్రత్యేకంగా ట్రాక్ రూపొందుతుంది. ట్రాక్ వెంబడి పర్యాటక సొబగులు ఉండేలా డిపిఆర్ సిద్దం చేయగా, దానిని అనుసరించి ఆధునిక రిసార్ట్ సౌకర్యం, మధ్య స్ధాయి కాన్పరెన్స్ సౌకర్యాలు, అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో అత్యాధునిక సౌండ్ అండ్ లైటింగ్ షో వంటి పర్యాటక సౌకర్యాలు ఉంటాయి. మరో వైపు కార్ల పరిశ్రమకు సంబంధించిన వివిధ సంస్ధల ఏర్పటును సైతం ప్రోత్సహించేలా ప్రాజెక్టును సిద్దం చేసినట్లు ఈ సందర్భంగా పర్యాటక కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. త్వరలోనే ప్రాజెక్టును నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయిడి దృష్టికి తీసుకు వెళ్లనున్నామని, ఆయన అనుమతి మేరకు తదుపరి ప్రణాళిక ఉంటుందని తెలిపారు.
జాతీయ, అంతర్జాతీయ స్ధాయి పర్యాటకులను ఆకర్షించటమే ప్రధాన ధ్యేయంగా ఈ కార్ రేసింగ్ ప్రాజెక్టుకు రూపకల్పన చేసామన్నారు. పర్యాటక ప్రాజెక్టుల వల్ల పరోక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగాలన్న సిఎం ఆలోచనలకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకున్నామని, ఈ ఫార్ములా త్రీ ఏర్పాటు వల్ల దాదాపు 300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరోక్షంగా మరో 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే రానున్న 18 నెలల్లో మొదటి దశ ప్రాజెక్టు పనులు పూర్తి అవుతాయని, తద్వారా అనంతరంపురం జిల్లాలోని కోటపల్లి ప్రాంతం ఆర్ధికంగా ముందడుగు వేస్తుందనటంలో సందేహం లేదని మీనా ఆశాభావం వ్యక్తం చేసారు. ప్రాజెక్టు మొదటి దశ పూర్తి అయిన ఆరునెలల వ్యవధిలో జాతీయ, అంతర్జాతీయ స్ధాయి కార్ రేస్‌లు ప్రారంభం అవుతాయన్నారు.