సచిన్ - ద్రవిడ్ రికార్డులకు అడుగు దూరంలో అజింక్యా రహానే
భారత క్రికెట్ లెజెండ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను సమం చేసేందుకు ఓ అడుగు దూరంలో ఉన్నాడు. సచిన్, ద్రావిడ్, కోహ్లీల పేరిట ఐదు వరుస మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది. ఈ రికార
భారత క్రికెట్ లెజెండ్లు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రవిడ్ రికార్డులను సమం చేసేందుకు ఓ అడుగు దూరంలో ఉన్నాడు. సచిన్, ద్రావిడ్, కోహ్లీల పేరిట ఐదు వరుస మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది. ఈ రికార్డుకు ఓ మెట్టు దూరంలో రహానే ఉన్నాడు.
ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్ కోసం ప్రస్తుతం కరేబియన్ దీవుల్లో పర్యటిస్తున్న కోహ్లీ సేనలోని సభ్యుల్లో రహానే ఒకడు. మొత్తం ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో 62, రెండో మ్యాచ్‌లో 103, మూడో మ్యాచ్‌లో 72, నాలుగో మ్యాచ్‌లో 60 పరుగులను రహానే సాధించాడు.
వరుసగా నాలుగు మ్యాచ్‌లో 50కి పైగా పరుగులను సాధించిన ఇతర ఆటగాళ్లలో అజారుద్దీన్, గంగూలీ, ద్రావిడ్, సిద్ధూ, కోహ్లీ, సురేష్ రైనాలు ఉన్నారు. వీరిలో సచిన్, అజారుద్దీన్‌లు రెండు సార్లు ఈ ఘనతను సాధించారు.
అయితే, సచిన్, ద్రావిడ్, కోహ్లీల పేరిట ఐదు వరుస మ్యాచ్‌లలో హాఫ్ సెంచరీలు చేసిన రికార్డ్ ఉంది. ఈ రికార్డును చేరుకునే అవకాశం రహానే ముంగిట ఉంది. వెస్టిండీస్ జట్టుతో జరిగే చివరిదైన ఐదో వన్డే మ్యాచ్‌లో రహానే అర్థ సెంచరీ చేస్తే సచిన్ - ద్రవిడ్ సరసన చేరుకున్నట్టే.