Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

యూరో 2020 : గోల్ కీపర్ కంగారు .. ప్రత్యర్థి ఖాతాలోకి పాయింట్

యూరో 2020 : గోల్ కీపర్ కంగారు .. ప్రత్యర్థి ఖాతాలోకి పాయింట్
, మంగళవారం, 29 జూన్ 2021 (12:57 IST)
ఫుట్‌బాల్ క్రీడలో గోల్‌కీపర్ పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అదే గోల్ కీపర్ ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా ప్రత్యర్థి ఖాతాలోకి పాయింట్ పడిపోతుంది. తాజాగా ఉత్కంఠ భరితంగా జరిగిన ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లో విజయం దక్కినప్పటికీ.. ఆ గోల్‌కీపర్‌కి మాత్రం చేదు అనుభవాన్ని మిగిల్చింది. 
 
గోల్‌ కీపర్‌ కంగారుతో ప్రత్యర్థి ఖాతాలో పాయింట్‌ జమ అయ్యింది. దీంతో అవతలి టీం ఆధిక్యంలోకి వెళ్లగా.. కాసేపు మ్యాచ్‌ ఆడియెన్స్‌లో టెన్షన్‌ పెంచింది. యూరో 2020 టోర్నీలో పదహారో రౌండ్‌ మ్యాచ్‌లో ఈ ఘటన జరిగింది.
 
యూరో 2020లో భాగంగా స్పెయిన్‌, క్రోయేషియా జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. అప్పటికే క్రొయేషియా 1-0తో ఆధిక్యంలో ఉంది. బార్సిలోనా(​‍స్పెయిన్‌ క్లబ్‌) మిడ్‌ ఫీల్డర్‌ పెడ్రి బంతిని పాస్‌ చేయగా.. అది గోల్‌కీపర్‌ ఉనయ్‌ సైమన్‌ ముందుకొచ్చింది. 
 
అయితే బంతిని కాలితో అడ్డుకోబోయినప్పటికీ పొరపాటున అతని షూ చివర తగిలి.. వెనకాల గోల్‌ నెట్‌ వైపు దూసుకెళ్లింది. అయితే రెప్పపాటులో జరిగిన ఆ పరిణామాన్ని అడ్డుకునేంత టైం సైమన్‌కు లేదు.
 
ఇక ఆ తర్వాత మ్యాచ్‌ జరుగుతున్నంత సేపు సైమన్‌ ముఖంలో ఆందోళనతో నిండిపోయింది. చివరికి ఎక్స్‌ట్రా టైం కలిసి రావడంతో 5-3 తేడాతో స్పెయిన్‌.. క్రొయేషియాపై విజయం సాధించింది. ఇక ఆ సెల్ఫ్‌ గోల్‌ తర్వాత సైమన్‌ చాలాసేపు స్థిమితంగా ఉండలేకపోయాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

EURO 2020 : గోల్ కీపర్ కంగారు పడ్డాడు.. ప్రత్యర్థి ఖాతాలో పాయింట్స్ యాడ్