ఫిఫా వరల్డ్ కప్ : క్వార్టర్ ఫైనల్‌లో ఇంగ్లండ్
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ పోటీల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన చివరి పోటీలో ఇంగ్లండ్ జట్టు కొలంబియాను చిత్తు చేసి విజయాన్ని సొంతం చేసుకుం
రష్యా వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ నాకౌట్ పోటీల్లో భాగంగా ఇంగ్లండ్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. హోరాహోరీగా సాగిన చివరి పోటీలో ఇంగ్లండ్ జట్టు కొలంబియాను చిత్తు చేసి విజయాన్ని సొంతం చేసుకుంది. చివరి నిమిషం వరకు ఉత్కంఠగా సాగగా, పెనాల్టీ షూటౌట్‌లో ఇంగ్లండ్ 4-3 తేడాతో విజయం సాధించింది.
ఆట ప్రారంభం నుంచి రెండు జట్లు జాగ్రత్తగా ఆడుతూ డిఫెన్సివ్‌కే పరిమితమయ్యాయి. తొలి అర్థగంట ఆటలో పరస్పరం రెండు సార్లు మాత్రమే గోల్‌పోస్ట్‌లపై దాడులు జరుపుకున్నాయి. ఆట 41వ, 52వ, 54వ,56వ నిమిషాల్లో కొలంబియా ఆటగాళ్లు వరుసగా ఎల్లోకార్డులు పొందారు. 56వ నిమిషంలో కొలంబియా ఆటగాడు జోర్డాన్ హాండర్సన్ బాక్స్‌లోపల తప్పిదం చేయడంతో రెఫరీ అతనికి ఎల్లో కార్డును ఇంగ్లండ్‌కు పెనాల్టీ కిక్‌ను ఇచ్చాడు.
ఇంగ్లండ్ ఆటగాడు హ్యారీకానే ఈ పెనాల్టీ కిక్‌తో విజయవంతంగా గోల్ చేసి తన జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. తర్వాత ఆటలో కొలంబియా ఆటగాళ్లు ఒత్తిడికి లోనయ్యారు. ఇంజ్యూరీ సమయం 93వ నిమిషంలో కొలంబియా ఆటగాడు మినా గోల్ చేయడంతో మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. పెనాల్టీ షూటౌట్‌లో కొలంబియా 3 గోల్స్ చేయగా… ఇంగ్లాండ్ 4 గోల్స్‌తో విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లో చోటు దక్కించుకుంది.