Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు.. జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కార్ ఆగ్రహం

రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపుర రహదారులు ఖరీదైన కార్లు తిరిగేందుకు అనువుగా లేవని, ఇక్కడ సర్వీస్ సెంటర్లు కూడా లేకపోవ

Advertiesment
Dipa Karmakar
, శనివారం, 15 అక్టోబరు 2016 (11:59 IST)
రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడవద్దని జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  త్రిపుర రహదారులు ఖరీదైన కార్లు తిరిగేందుకు అనువుగా లేవని, ఇక్కడ సర్వీస్ సెంటర్లు కూడా లేకపోవడంతో తనకు బహుమతిగా ఇచ్చిన బీఎండబ్ల్యూ కారును వెనక్కి ఇచ్చేయనున్నట్టు దీప ప్రకటించిన సంగతి తెలిసిందే. కారు తీసుకుని దాని విలువకు తగిన మొత్తాన్ని ఇవ్వాలని దీప కోరింది. ఆఈ వ్యాఖ్యలపై త్రిపుర ప్రభుత్వం గుర్రుగా ఉంది.
 
ఈ వ్యాఖ్యాలపై ఆ రాష్ట్ర మంత్రులు బాదల్, మాణిక్ దేవ్‌లు స్పందిస్తూ... రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు. మె ప్రకటనపై ప్రభుత్వం స్పందించింది. త్రిపురలో రాష్ట్రపతి, ప్రధాని, ఇతర విదేశీ ప్రముఖుల కార్లు తిరుగుతున్నాయని, వాటికి లేని ఇబ్బంది ఆమెకు ఎలా వచ్చిందని మంత్రి బాదల్ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడిన దీపకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని మరో మంత్రి మాణిక్ దేవ్ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మాజీ ప్రియురాలిపై అత్యాచారం కేసులో భారత హాకీ కెప్టెన్ సర్దార్ సింగ్‌కు ఊరట