Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

దీపా కర్మాకర్‌కు ఖేల్ రత్న?: జిలేబీ ఎలా చేస్తారు.. బ్రెజిల్ అధికారులు.. యూట్యూబ్‌లో..?

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో ధీటుగా రాణించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రియోలో పతకం చేజార్చుకున్నప్పటికీ నాలుగో స్థానంల

దీపా కర్మాకర్‌కు ఖేల్ రత్న?: జిలేబీ ఎలా చేస్తారు.. బ్రెజిల్ అధికారులు.. యూట్యూబ్‌లో..?
, బుధవారం, 17 ఆగస్టు 2016 (16:24 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్‌లో ధీటుగా రాణించిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు ఖేల్ రత్న అవార్డు ఇవ్వాలని కేంద్ర క్రీడల శాఖ ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. రియోలో పతకం చేజార్చుకున్నప్పటికీ నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్‌తో పాటు షూటర్ జీతూరాయ్‌కు కూడా ఖేల్‌రత్న ఇవ్వాలని ప్రతిపాదించారు.

ఇకపోతే.. హాకీ ఆటగాడు రఘునాథ్‌కు అర్జున అవార్డ్ ఇవ్వాలని,  ప్రముఖ క్రికెటర్ అజింక్యా రహానేకు కూడా అర్జున అవార్డు ఇవ్వాలని సిఫార్సు చేసినట్లు వార్తలొస్తున్నాయి. 
 
ఇదిలా ఉంటే.. రియో ఒలింపిక్స్ అధికారులకు ఓ అనుమానం వచ్చింది. అదీ ఆసక్తికర అనుమానం. ఇదేంటి ఆసక్తిరమా.. అనుకుంటున్నారా.. అయితే చదవండి. బ్రెజిల్‌లోని భారత రాయబార కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా... బ్రెజిల్‌లో జరుగుతున్న ఒలింపిక్స్‌ భద్రత పర్యవేక్షించేందుకు భారత నుంచి ఇద్దరు అధికారులు వెళ్లారు.
 
వీరిలో తెలంగాణ పోలీస్ విభాగంలో ఎస్పీగా పనిచేస్తున్న రమేష్ రెడ్డి ఒకరు. ఇక భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా భారత రాయబార కార్యాలయానికి జిలేబీ, సమోసా పంపించారు. ఇక జిలేబీ రుచి చూసిన అక్కడి భద్రతా అధికారులు అది ఎలా తయారు చేస్తారనే విషయం తెలుసుకోవాలనుకున్నారు.
 
వెంటనే యూట్యూట్‌ సహాయంతో బిగ్‌స్ర్కీ‌న్‌పై జిలేబీ తయారీ విధానాన్ని రమేష్‌ ప్రదర్శించారు. దీంతో ఎలాగైనా జిలేబీని టేస్ట్ చేసేందుకు ఇండియా దాకా వెళ్ళాల్సిన అవసరం లేదని.. బ్రెజిల్‌లోనే ఈ రిసిపి సాయంతో తయారు చేసుకోవచ్చునని రాయబార కేంద్ర అధికారులు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రియోలో బాలీవుడ్ సాంగ్‌ సూపర్ హిట్... 'ఐలా రే' సాంగ్‌కు ఈత కొలనులో అద్భుత విన్యాసాలు (video)