Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లియాండర్ పేస్ ఓ విష పురుగు... చాలా ప్రమాదకారి.. సానియా మీర్జా ట్వీట్

భారత టెన్నిస్ రంగంలో మరో వివాదం రాజుకుంది. అగ్రశ్రేణి క్రీడాకారిణి సానియా మీర్జా, దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న లియాండర్ పేస్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. లియాండర్ పేస్ చాలా ప్రమాదకారి అంటూ ట్వ

Advertiesment
Did Sania Mirza call Leander Paes a toxic person?
, సోమవారం, 19 సెప్టెంబరు 2016 (12:18 IST)
భారత టెన్నిస్ రంగంలో మరో వివాదం రాజుకుంది. అగ్రశ్రేణి క్రీడాకారిణి సానియా మీర్జా, దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్న లియాండర్ పేస్‌పై సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. లియాండర్ పేస్ చాలా ప్రమాదకారి అంటూ ట్విట్టర్లో విరుచుకుపడింది. 
 
అంతకుముందు స్పెయిన్‌తో జరిగిన డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే-ఆఫ్ పోటీల్లో ఘోరంగా విఫలం కావడంతో పేస్ మాట్లాడాడు. సానియాపై విమర్శలు చేశాడు. అంతేగాకుండా సానియా మీర్జా - రోహన్ బోపన్నలను రియో ఒలింపిక్స్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగానికి ఎంపిక చేయడంపై విమర్శలు చేశాడు. సానియా, బోపన్నల జోడి సెమీ ఫైనల్స్ మ్యాచ్‌లో అమెరికాకు చెందిన వీనస్ విలియమ్స్, రాజీవ్ రామ్‌ల చేతిలో ఓడిపోవడంపై లియాండర్ పేస్ సెటైర్లు విసిరాడు. 
 
ఈ ఒలింపిక్స్‌లో భారత్, తన అత్యుత్తమ టీమ్‌ను రంగంలోకి దింపడంలో విఫలమైందన్నాడు. 14 నెలల వ్యవధిలో నాలుగు గ్రాండ్ స్లామ్‌లను గెలిచిన తనను వదిలేశారని ఆరోపించాడు. దీన్ని తీవ్రంగా ఆక్షేపించిన సానియా మీర్జా, ప్రమాదకరమైన వ్యక్తితో ఆడటమంటే, అది ఆటే అనిపించుకోదని వ్యాఖ్యానించింది.

పేస్ పేరును ప్రస్తావించకుండా ఓ విషపురుగు అంటూ విమర్శించింది. సమస్యలు సృష్టించే వ్యక్తులతో కలిసి ఆడకపోవడమే విజయం సాధించడమని పరోక్షంగా పేస్‌ను ఉద్దేశించి సానియా ట్వీట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్రికెటర్లపై సినిమాలు తీయాల్సిన అవసరం లేదు: గౌతం గంభీర్