Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మియాందాద్‌ను విమర్శిస్తే లేపేస్తాం... అఫ్రిదికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ బెదిరింపు

పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. మాజీ క్రికెటర్ మియాందాద్‌పై అనవసరంగా నోరు పారేసుకుంటే బాగుండదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు.

Advertiesment
Dawood Ibrahim threatens
, శనివారం, 15 అక్టోబరు 2016 (13:54 IST)
పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఘాటైన హెచ్చరికలు జారీ చేశారు. మాజీ క్రికెటర్ మియాందాద్‌పై అనవసరంగా నోరు పారేసుకుంటే బాగుండదని గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. 
 
ఒకే దేశానికి చెందిన ఈ ఇద్దరు క్రికెటర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న విషయం తెల్సిందే. అఫ్రిది ‘మ్యాచ్ ఫిక్సర్’ అని మియాందాద్ ఆరోపించడంతో ఇద్దరి మధ్య వివాదం మొదలైంది. మియాందాద్‌ ఆరోపణలను ఖండించిన అఫ్రిది అతడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు. 
 
ఈ నేపథ్యంలో ఈనెల 12న అఫ్రిదికి ఫోన్ చేసిన దావూద్.. మియాందాద్‌పై ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం ఆపాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించాడు. మరోవైపు... అఫ్రిది, మియాందాద్ ఇద్దరూ తనకు ఎంతో కావాల్సిన వారిని, వివాదానికి ఇక్కడితో పుల్‌స్టాప్ పెట్టాలని మాజీ క్రికెటర్ వాసిం అక్రమ్ సూచించాడు. వారిద్దరి మధ్య జరిగిన వివాదం త్వరలో సమసిపోతుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాష్ట్రాన్ని కించపరిచేలా మాట్లాడొద్దు.. జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌పై త్రిపుర సర్కార్ ఆగ్రహం