Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రియో ఒలింపిక్స్‌కు వెళ్తున్నారా? నగలు ధరించొద్దు.. దొంగలుంటారు జాగ్రత్త..!

ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ వెళ్తున్న తమ క్రీడాకారులకు, పౌరులకు చైనా అప్రమత్తం చేసింది. స్నానాల గదికి వెళ్లి వచ్చేసరికి తన సంచీని ఎవరో దొంగతనం చేశారని చైనాకు చెందిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ ష

Advertiesment
China warns after attacks on Olympic delegates in Rio
, ఆదివారం, 31 జులై 2016 (10:25 IST)
ప్రతిష్టాత్మక రియో ఒలింపిక్స్ వెళ్తున్న తమ క్రీడాకారులకు, పౌరులకు చైనా అప్రమత్తం చేసింది. స్నానాల గదికి వెళ్లి వచ్చేసరికి తన సంచీని ఎవరో దొంగతనం చేశారని చైనాకు చెందిన ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెట్‌ షి డాంగ్‌పెంగ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. రియో ఒలింపిక్‌ గ్రామంలో భద్రతపరమైన ఏర్పాట్ల పట్ల చాలా దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
 
అందుకే క్రీడాకారులు బయట ప్రదేశాల్లో తిరుగుతున్నప్పుడు తమ బ్యాగులను అప్రమత్తంగా ఉంచుకోవాలని సూచించింది. అలాగే రియో ఒలింపిక్స్ చూసేందుకు వెళ్లే పౌరులు దొంగతనాలు, భద్రత పరమైన చిక్కుల పట్ల జాగ్రత్తగా ఉండాలని చైనా పేర్కొంది. 
 
రియోలోని ఓ హోటల్‌లో తన సంచీని ఎవరో కొట్టేశారని ఓ అథ్లెట్‌, కొందరు అధికారులు సైతం ఇదే తరహా ఫిర్యాదులు చేయడంతో చైనా హెచ్చరికలు జారీ చేసింది. మురికివాడల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అలాగే ఒలింపిక్ విలేజ్‌కు చాలా దూరమైన ప్రాంతాల్లో చైనా పౌరులు సంచరించకూడదని, అలాగే ఖరీదైన వస్తువులను తమతో తీసుకెళ్లకూడదని పేర్కొంది. 
 
ఖరీదైన గడియారాలు, నగలు ధరించకండి. వీధుల్లో నడిచేటప్పుడు సెల్‌ఫోన్లు వాడవద్దని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బ్రెజిల్‌లోని తమ దౌత్య కార్యాలయం ద్వారా ప్రకటన జారీ చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత శ్రీలంక గెలుపు.. రికార్డుల పంట పండించిన లంకేయులు..!