Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాపై 17 ఏళ్ల తర్వాత శ్రీలంక గెలుపు.. రికార్డుల పంట పండించిన లంకేయులు..!

కంగారూల జట్టైన ఆస్ట్రేలియాపై లంకేయులు 17 సంవత్సరాల తర్వాత రెండో విజయాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో 1999, సెప్టెంబర్ 11న కాండీలోని అస్గిరియా స్టేడియంలో చివరిసారిగా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో గెలుపున

Advertiesment
Sri Lanka
, శనివారం, 30 జులై 2016 (17:49 IST)
కంగారూల జట్టైన ఆస్ట్రేలియాపై లంకేయులు 17 సంవత్సరాల తర్వాత రెండో విజయాన్ని కైవసం చేసుకున్నారు. గతంలో 1999, సెప్టెంబర్ 11న కాండీలోని అస్గిరియా స్టేడియంలో చివరిసారిగా ఆస్ట్రేలియా టెస్టు మ్యాచ్‌లో గెలుపును నమోదు చేసుకున్న శ్రీలంక.. మళ్లీ ఆస్ట్రేలియాపై సుదీర్ఘ విరామం తర్వాత విజయ కేతనం ఎగుర వేసింది.

మూడు టెస్టు సిరీస్‌లో భాగంగా సొంతగడ్డ పల్లెకెల్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో ఆసీస్‌పై 106 పరుగుల తేడాతో శ్రీలంక గెలుపొందింది. తద్వారా 1-0 ఆధిక్యంలో లంక ముందుంది. సనత్ జయసూర్య, మత్తయ్య మురళీధరన్, సంగార్కర, జయవర్ధనే, దిల్షాన్‌ వంటి అగ్ర క్రికెటర్లు జట్టులో లేకపోయినా.. కంగారూలపై విజయం సాధించారు. 
 
ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులు స్వల్ప స్కోరుకే వెనుదిరిగిన కుశాల్ మెండిస్ సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం 176 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. తద్వారా ఆసీస్‌పై అత్యుత్తమ స్కోరు సాధించిన రెండో బ్యాట్స్‌మెన్‌గా కుశాల్ మెండిస్ నిలిచాడు. అంతకుముందు 2008లో కుమార సంగక్కర ఆసీస్‌పై 192 పరుగుల అత్యధిక స్కోరు సాధించాడు.
 
ఇక బౌలర్ రంగనా హెరాత్ మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీయగా రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన రంగనా హెరాత్ మొత్తం 24 సార్లు ఈ ఫీట్‌ను సాధించాడు. ఇది శ్రీలంక క్రికెట్ చరిత్రలో రెండో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన కావడం విశేషం. మొదటి స్థానంలో స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ 67 సార్లు ఐదు వికెట్లు సాధించిన ఆటగాడిగా రికార్డు సాధించాడు.
 
ఇక ఈ ఓటమితో ఆస్ట్రేలియా ఆసియా ఖండంలో వరుసగా ఏడో పరాజయాన్ని చవిచూసింది. 2013లో భారత్‌పై 4 మ్యాచ్‌లను ఓడిపోగా, 2014/15లో రెండు మ్యాచ్‌లను పాకిస్థాన్‌పై ఓడిపోయింది. చివరిగా 2011లో గాలెలో శ్రీలంకపై గెలవడమే ఆసిస్ చివరి విజయం కావడం గమనార్హం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విరాట్ కోహ్లీ పాక్ అంపైర్ కుమారుడికి వీడియో పంపాడు.. బ్యాటు కూడా ఇస్తాడట!