భారత మహిళా రెజ్లర్ వినేశ్ ఫోగాట్‌కు నిరాశ తప్పలేదు. ప్యారిస్ ఒలింపిక్స్‌లో మహిళల 50 కిలోల విభాగంలో వినేశ్ ఫైనల్‌కు చేరింది. అయితే, ఫైనల్‌కు ముందు నిర్ణీత పరిమితి కంటే వంద గ్రాములు అధికంగా బరువు ఉన్నట్లు తేలడంతో అనర్హురాలిగా ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో తనకు సిల్వర్ మెడల్ ఇవ్వాలంటూ చేసిన అప్పీల్‌ను స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్ తిరస్కరించింది. కాస్ నిర్ణయంతో ఒలింపిక్‌లో పతకం సాధించాలన్న వినేశ్ కల చెదిరిపోయినట్లయ్యింది.
వినేశ్ అప్పీలును ట్రిబ్యునల్ ఫర్ స్పోర్ట్స్ తిరస్కరించడంపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉష నిరాశ వ్యక్తం చేశారు.
ఈ కేసులో వినేశ్ ఫోగాట్‌కు అనుకూలంగా తీర్పు వచ్చి ఉంటే, ఆమెకు రజత పతకం దక్కేది. కానీ సీఏఎస్ ఆమె పిటిషన్‌ను కొట్టివేయడంతో ఉత్తచేతులతో పారిస్ ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించినట్టయింది.