Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బ్రిటన్ సింగర్‌ జాస్మిన్ వాలియాతో హార్దిక్ పాండ్యా డేటింగ్?

Advertiesment
jasmin walia

ఠాగూర్

, బుధవారం, 14 ఆగస్టు 2024 (13:32 IST)
భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా బ్రిటన్ సింగర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్నారనే వార్తలు గత కొంతకాలంగా హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వారిద్దరూ తాజాగా నాలుగు రోజులు ఒకే లొకేషన్‌లో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇపుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పైగా, హార్దిక్ పాండ్యా కూడా తన ఇన్‌స్టాలో షేర్ చేసిన తాజా వీడియోతో ఈ ఊహాగానాలు కూడా ఊపందుకున్నాయి. 
 
హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గ్రీస్‌లో సేదతీరుతున్నారు. తన హోటల్‌లోని స్విమ్మింగ్ పూల్‌ ముందు నడుస్తూ వీడియో తీసి అప్‌లోడ్ చేశాడు. ఈ వీడియోకు బ్రిటన్ సింగర్, టీవీ నటి జాస్మిన్ వాలియా లైక్ కొట్టారు. 
 
నాలుగు రోజుల క్రితం సరిగ్గా ఇదే స్థంలో వాలియా కూడా ఫోటో దిగి ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఈ పోస్టుకు పాండ్యా కూడా లైక్ కొట్టాడు. గతంలో వాలియా పెట్టిన పలు పోస్టులకు పాండ్యా కామెంట్స్  చేసిన విషయం తెల్సిందే. ఈ క్రమంలో వారిద్దరూ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ కలిసే విహారయాత్రకు వెళ్లారని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
 
ఇంతకీ జాస్మిన్ వాలియా ఎవరు? 
బ్రిటన్‌కు చెందిన జాస్మిన్ వాలియా ఒక నటి. సింగర్. యూట్యూబర్. నివాసం ఇంగ్లండ్‌లోని ఎసెక్స్. టీవీ షోలు, రియాల్టీ షోల ద్వారా అభిమానులను సంపాదించుకుంది. సొంతంగా యూట్యాబ్ చానెల్ పెట్టి పలు ఆల్బ‌మ్‌లు రిలీజ్ చేసింది. ఆమె పాడిన బామ్ డిగీ పాటలను బాలీవుడ్ సినిమాలో రీమేక్ చేశారు. బాలవుడ్ సింగ్ ఆసిమ్ రియాజ్‌తో కలిసి జాస్మిన్ ఓ మ్యూజిక్ వీడియో చేసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వినేశ్ ఫొగాట్‌కు మళ్లీ నిరాశ.. తుది తీర్పు కోసం ఆగాల్సిందే...