Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆసియా క్రీడలు : షూటింగులో భారత్‌కు బంగారు పతకం

gold medal
, బుధవారం, 27 సెప్టెంబరు 2023 (13:33 IST)
ఆసియా క్రీడా పోటీల్లో భాగంగా బుధవారం భారత్ ఖాతాలో మరో బంగారు పతకం వచ్చి చేరింది. మహిళల 25 మీటర్ల పిస్టల్ విభాగంలో మను భాకర్, ఈషా సింగ్, రిథమ్ సాంగ్వాన్‌లు అగ్రస్థానంలో నిలిచి షూటింగులో బంగారు పతకాన్ని కైసవం చేసుకున్నారు. 
 
ఈ పోటీ నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఉత్కంఠ పోరులో ఆతిథ్య చైనాను భారత్ మట్టి కరిపించింది. భారత షూటర్స్ త్రయం ప్రత్యర్థుల కంటే మూడు ఎక్కువ పాయింట్ల 1759 పాయింట్లతో పోటీని ముగించారు. చైనాలోని హౌంగ్జౌలో జరుగుతున్న ఆసియా క్రీడా పోటీల్లో భారత్‌కు ఇది 16వ పతకం కావడం గమనార్హం. 


శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు యువగళం పాదయాత్ర పునఃప్రారంభం 
 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువళం పేరుతో చేపట్టిన పాదయాత్రను ఈ నెల 29వ తేదీ శుక్రవారం రాత్రి 8.15 నిమిషాలకు పునఃప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆ పార్టీ ఏపీ శాఖ అధ్యక్షుడు కె.అచ్చెన్నాయుడు అధ్యక్షతన జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశం తర్వాత ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, తమ పార్టీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసు బనాయించి అరెస్టు చేసిన సమయంలో నారా లోకేశ్ ఎక్కడ పాదయాత్రను ఆపివేశారో.. అక్కడ నుంచే ఇది ప్రారంభమవుతుందని చెప్పారు. 
 
కక్షసాధింపులే ధ్యేయంగా జగన్ సర్కార్ రోజుకొకటిగా తెరపైకి తెస్తున్న తప్పుడు అంశాలపై ప్రజల్లోనే తేల్చుకోవాలని టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్ణయించిందని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.
 
'నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారు. దీనిపై కూడా సమావేశంలో చర్చించాం. చంద్రబాబు అక్రమ అరెస్టుతో నిలిచిపోయిన పాదయాత్రను తిరిగి శుక్రవారం రాత్రి 8.15 నిమిషాల నుంచి రాజోలు నుంచే ప్రారంభించాలని లోకేశ్ తోపాటు మేమంతా ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నాం. పాదయాత్ర కొనసాగింపునకు అన్ని అనుమతులు తీసుకున్నాం' అని అచ్చెన్నాయుడు వెల్లడించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాలుగు దశాబ్దాల తర్వాత భారత్‌కు బంగారు పతకం