రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగడం డౌటేనా? డోపింగ్ ఏజెన్సీ ఏమంటోంది?!
రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అనుమానాస్పదమైంది. వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా దోషిగా తేలితే ఆ జట్టును రియో 2016కు అనుమతించకూడదని యాంటీ డోపింగ్ ఏజెన్సీలు డిమాండ్ చేస్త
రియో ఒలింపిక్స్‌లో రష్యా బరిలోకి దిగుతుందా? లేదా? అనేది ప్రస్తుతం అనుమానాస్పదమైంది. వింటర్ ఒలింపిక్స్‌లో రష్యా దోషిగా తేలితే ఆ జట్టును రియో 2016కు అనుమతించకూడదని యాంటీ డోపింగ్ ఏజెన్సీలు డిమాండ్ చేస్తున్నాయి.
ఐవోసీ ఒలింపిక్స్ రూల్స్ అమలు చేయడంలో ఆదర్శంగా ఉంటుందని నమ్ముతున్నామని కెనడియన్ సెంటర్ ఫర్ ఎథిక్స్ ఇన్ స్పోర్ట్స్ సీఈఓ పాల్ మెలియా తెలిపారు. తమగోడు విని 2016 రియో ఒలింపిక్ క్రీడలలో పాల్గొనకుండా రష్యాను నిషేధించాలని కోరారు.
అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీలోని కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని బయటపెట్టారు. దీంతో అమెరికాకు చెందిన యాంటీ డోపింగ్ ఏజన్సీ రష్యా జట్టును ఒలింపిక్స్ నుంచి నిషేధించాలని పట్టుబట్టింది. దీనికి కెనడా కూడా మద్దతు పలికింది.