స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు అనూహ్యంగా ఒలింపిక్స్ ముందు వరకు కోచ్ పుల్లెల గోపీచంద్ అకాడమీ నుంచి వైదొలగింది. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న సింధు ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది.
ఆయనతో కొన్ని సంవత్సరాల పాటు ప్రయాణం చేశానని తెలిపింది. ఆ తర్వాత మా మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయి. కొన్ని విషయాలు నచ్చలేదని వెల్లడించింది.
నటనపై ఎటువంటి ప్రభావం పడకూడదనే ఉద్దేశంతో, ఆటపై మాత్రమే పూర్తి దృష్టి సారించాలని అకాడమీ నుంచి బయటకు రావాల్సి వచ్చింది. ఓ ప్లేయర్ ఆడేటప్పుడు ఎటువంటి వివాదాలు ఉండకూడదని చెప్పింది.
బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందడానికి చిన్నప్పుడు సికింద్రాబాద్‌లోని మారేడ్పల్లి నుంచి గచ్చిబౌలిలోని పుల్లెల గోపీచంద్ అకాడమీ వరకు ప్రయాణం చేయాల్సి వచ్చేదని సింధు పేర్కొంది.
ఆమెను తీసుకెళ్లి.. శిక్షణ ఇప్పించి తిరిగి తీసుకొచ్చే బాధ్యతను తండ్రి రమణే తీసుకున్నారని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి తన తల్లిదండ్రులు చాలా త్యాగాలు చేసినట్లు గుర్తుచేసుకుంది.