Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రికార్డు స్థాయిలో సెన్సెక్స్ ట్రేడింగ్

Advertiesment
BSE
బాంబే స్టాక్ మార్కెట్‌లో బుల్ ర్యాలీ కొనసాగుతోంది. గత ఎనిమిది సెషన్ల నుంచి మార్కెట్లు ట్రేడింగ్ ముగిసే సమయానికి లాభాల్లో ముగుస్తున్నాయి. గురువారం నాటి ట్రేడింగ్‌ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 125 పాయింట్లు లాభపడి 26,272కి పెరగగా, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 7,831కి చేరుకుంది.
 
ఈ ట్రేడింగ్‌‍లో ఫైనాన్షియల్ టెక్నాలజీస్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, రిలయన్స్ క్యాపిటల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ కంపెనీల షేర్లు లాభాలబాటలో పయనించగా, ఐపీసీఏ ల్యాబ్, జేపీ పవర్, కెయిర్న్ ఇండియా, జైప్రకాష్ అసోసియేట్స్, సన్ టీవీ నెట్ వర్క్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu