Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

Advertiesment
BSE Sensex falls
భారతీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజైన శుక్రవారం కూడా భారీ నష్టాలను మూటగట్టుకుంటున్నాయి. శుక్రవారం ఉదయం ప్రారంభ ట్రేడింగ్‌లో లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. దాదాపు 16 నెలల తర్వాత నిఫ్టీ ఈ వారంలో భారీగా పతనమైంది. బీఎస్ఈ సెన్సెక్స్ 348 పాయింట్లు కోల్పోయి 25,024 వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 108 పాయింట్లు కోల్పోయి 7,460 వద్ద స్థిరపడ్డాయి. 
 
కాగా, ఈ ట్రేడింగ్‌లో సన్ ఫార్మా ఇండియా, టీసీఎస్, రెడ్డీస్ ల్యాబ్, హిందుస్థాన్ యూనిలీవర్, విప్రో తదితర కంపెనీల షేర్లు లాభాలను అర్జించగా, బీహెచ్ఈఎల్, హిండాల్కో, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టీ, టాటా స్టీల్ తదితర కంపెనీల షేర్లు నష్టాలను చవిచూశాయి. 

Share this Story:

Follow Webdunia telugu