Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డిసెంబర్‌లో దుబాయ్‌లో ఏమి చేయవచ్చు?

Advertiesment
Dubai
చల్లని వాతావరణం, ఔట్ డోర్  అనుభవాలు, పండుగ వినోదం ఆఫర్‌తో, దుబాయ్‌ని సందర్శించడానికి సరైన సమయంగా డిసెంబర్ నిలుస్తుంది. సంవత్సరం చివరి నెలలో, యుఎఈ  జాతీయ దినోత్సవం, దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ నుండి ఎమిరేట్స్ దుబాయ్ 7లు మరియు నూతన సంవత్సర వేడుకల వరకు నగరం అంతటా అనేక ప్రధాన కార్యక్రమాలు జరుగుతాయి. డిసెంబర్ 2024లో దుబాయ్‌లో ఏమి చేయవచ్చో తెలిపే కొన్ని ఉత్తమమైన విషయాలు ఇక్కడ ఉన్నాయి.
 
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్
దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ (డిఎస్ఎఫ్) 30వ ఎడిషన్ 6 డిసెంబర్ 2024 నుండి 12 జనవరి 2025 వరకు జరుగుతుంది. ఈ ప్రతిష్టాత్మక వార్షిక కార్యక్రమం అద్భుతమైన షాపింగ్ అనుభవాలు, డీల్‌లతో నిండి ఉంది. సందర్శకులకు జీవితాన్ని మార్చే బహుమతులను గెలుచుకునే అవకాశం సైతం వుంది.  
 
ఔట్ డోర్ అనుభవాలు
ఎడారి సఫారీలు, నక్షత్రాల క్రింద రాత్రి గడపడం ఒక మరపురాని అనుభవం. 
హట్టాలో హైకింగ్ ట్రైల్స్, మౌంటెన్ బైకింగ్, మంచినీటి సరస్సులపై కయాకింగ్‌, క్యాంపింగ్, గ్లాంపింగ్ వంటివి ఉంటాయి. మీరు సంతోషకరమైన అనుభవాన్ని కోరుకుంటే, అట్లాంటిస్, ది పామ్ మరియు జుమేరాస్ వైల్డ్ వాడి వంటివి వున్నాయి. 
 
దుబాయ్ థీమ్ పార్కులు మరియు రిసార్ట్స్ మధ్యప్రాచ్యంలో అతిపెద్ద థీమ్ పార్క్ గమ్య స్థానంగా వుంది.
 
కాలానుగుణ ఆకర్షణలు
నగరం అంతటా శీతాకాలపు మార్కెట్‌లు ఉన్నాయి, ఎక్స్‌పో సిటీ దుబాయ్‌లోని వింటర్ సిటీ (డిసెంబర్ 6-31), దుబాయ్ మీడియా సిటీ యాంఫిథియేటర్‌లోని వింటర్ డిస్ట్రిక్ట్ (డిసెంబర్ 14-22), సౌక్ మదీనాట్ జుమేరా క్రిస్మస్ మార్కెట్(డిసెంబర్ 6 నుండి), హబ్టూర్ ప్యాలెస్ దుబాయ్ యొక్క వింటర్ గార్డెన్ ప్రసిద్ధ ఆకర్షణలుగా నిలవనున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఇండియా, యుకె, యుఎస్ఏ వ్యాప్తంగా తమ బ్రేక్ త్రూ 2024 కోసం ఎంపికైన వ్యక్తులను వెల్లడించిన బాఫ్టా