Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మన వారైతే ఫర్వాలేదా

Advertiesment
మన వారు ఫర్వాలేదు మంత్రి ముఖేష్ గౌడ్

Srinivasulu

వార్తముషీరాబాద్‌లో మంత్రి ముఖేష్ గౌడ్ ఇంటిలో డబ్బులు పంచుతున్నారనే వివాదం కాంగ్రెస్, సీపీఎం కార్యకర్తల మధ్య తీవ్ర స్థాయి ఘర్షణకు దారి తీసింది. ఈ సందర్భంగా మంత్రి ముకేష్‌పై వారు చేయి చేసుకున్నారు.

చెవాకులెఫ్ట్ నేతలు ఒక్క విషయం గుర్తు చేసుకోవాలి. గెలుపు కోసం అన్ని రకాల ఎత్తులూ వేయకుండా ఉండేందుకు వారేమైనా అమాయకులా. ఎన్నికల సమయంలో డబ్బులు పంచడం ఏదో కొత్త విషయమన్నట్టు అక్కడకు వెళ్లి గొడవపడటమెందుకు? గత పర్యాయం మీతో కలసి పోటీ చేసినపుడు కూడా వారు ఇదే పద్ధతినే అవలంబించారనే విషయం మీకు తెలియదా. ఇంతకూ మీ మిత్రపక్షమైన టీడీపీ ఎక్కడా డబ్బులు పంచడం లేదుకదా. లేకుంటే వారు మన వారే కదా అని అలా వదిలేస్తున్నారా. న్యాయమంటే అందరికీ ఒకటేననే విషయాన్ని మాత్రం మీరు మరచిపోతున్నారేమోననిపిస్తోంది. ఇక రౌడీయిజమంటారా? దాని ఆటకట్టించేందుకు వ్యవస్థలో సమూల మార్పులు రావాల్సి ఉందన్నది మీకు తెలియదా.

Share this Story:

Follow Webdunia telugu