Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తొందరపాటా...ఆలస్యమా..!

Advertiesment
తొందరపాటా...ఆలస్యమా..!
, మంగళవారం, 23 సెప్టెంబరు 2008 (17:48 IST)
FileFILE
వార్త : విజయ దశమికి అటు, ఇటుగా తెలుగుదేశం పార్టీ ప్రత్యేక తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. దానికి తగ్గట్టు త్వరగా తెలంగాణపై నివేదిక సమర్పించాల్సిందిగా కోర్ కమిటీని పార్టీ చీఫ్ చంద్రబాబు స్వయంగా సూచించారని వెల్లడించాయి.

చెవాకు : ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవడంలో మీరు తొందరపడుతున్నారో లేక ఇప్పటికే ఆలస్యమైందో తెలియడం లేదు. ఈ నిర్ణయమేదో ముందే తీసుకుని ఉంటే తెలంగాణలో దేవేందర్ గౌడ్, పెద్దిరెడ్డిలు బయటకు వెళ్లే వారు కాదేమో.

ఒకవేళ ఆయనను వదిలించుకోవాలన్నదే మీ ఉద్ధేశ్యమైనా తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పని చేసి ఉండొచ్చు. ఎలాగూ కేసీఆర్ మీకు మిత్రుడైపోతాడు కాబట్టి పార్టీలో కూడా గౌడ్ ప్రాధాన్యాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఉండొచ్చు.

అయితే ఈ నిర్ణయం ద్వారా కోస్తా, సీమల్లో పార్టీకేమీ దెబ్బ తగలదని గట్టిగా నమ్ముతున్నారా లేక ఎలాగూ బాలయ్య, ఎన్టీఆర్ సహా నందమూరి హీరోలతో అక్కడ గట్టెక్కేస్తామనుకుంటున్నారా. ఏమో గట్టి జాగ్రత్తలు తీసుకోకుంటే తుస్సు మనే ప్రమాదముంది జాగ్రత్త.

Share this Story:

Follow Webdunia telugu