బాబోయ్... ఇదేం వెటకారం... పాత భార్య చెలామణిలో ఉండదట... కొత్త భార్యతో రోజూ 2 గంటలట...
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల నిర్ణయం మరీ వెటకారంగా మారింది. రాత్రికి రాత్రి ప్రధాని మోదీ చేసిన నోట్ల రద్దు ప్రకటన... దేశం మొత్తంలో ఆర్థిక వ్యవస్థనే కాదు... సోషల్ మీడియానూ ఒక్క ఊపు ఊపింది. ఇంతగా ఏ సబ్జెక్ట్ మీదా నెట్
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల నిర్ణయం మరీ వెటకారంగా మారింది. రాత్రికి రాత్రి ప్రధాని మోదీ చేసిన నోట్ల రద్దు ప్రకటన... దేశం మొత్తంలో ఆర్థిక వ్యవస్థనే కాదు... సోషల్ మీడియానూ ఒక్క ఊపు ఊపింది. ఇంతగా ఏ సబ్జెక్ట్ మీదా నెట్‌జన్లు స్పందించి, జోకులు, సెటైర్లు, పేరడీలు, పోస్టింగులు చేసిన అంశం ఇంతవరకూ లేదు.
ఏ అంశం పైన అయినా, సోషల్ మీడియాలో హల్‌చల్ ఒకటిరెండు రోజుల పాటు నడుస్తుంది. కానీ, ఈ నోట్ల వ్యవహారం మాత్రం గత పదిరోజులుగా హల్‌చల్ చేస్తూనే ఉంది. ఇక ఈ నిర్ణయంపై ప్రశంసలు, విమర్శలు, ఆవేదనలే కాదు. వెటకారాలు, పెదవి విరుపులు కూడా చాలా ఎక్కువయ్యాయి. తాజాగా ఒక సెటైర్ అందరినీ ఔరా అనిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వ తదుపరి సంచలనాత్మక నిర్ణయం....
- ఈ రోజు అర్థరాత్రి 12 గం. నుండి అన్ని పాత వివాహాలు రద్దు. పాత భార్య రేపటి నుండి చలామణిలో ఉండదు.
- మీరు మీ పాత భార్యను డిసెంబరు 30 లోగా కోర్టులో లేదా వారి కన్నవారి ఇంట్లో జమ చేయాలి.
- తరువాత రెండు రోజుల వరకు అన్ని కళ్యాణ మండపాలు, రిజిష్టర్ ఆఫీసులు, మందిరాలు మూతబడతాయి.
- నవంబరు 30 వరకు ప్రతి రోజు 2 గంటలు కొత్త భార్యతో గడపవచ్చు, నెమ్మదిగా ఈ సమయం పెంచబడును.
ఇలా సెటైర్లు కొనసాగుతున్నాయి... ఏం చేస్తాం... ఎవరి ఐడియా వారిది...