Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఊహించని విధంగా చిన్న సినిమాలకు పట్టం పెద్ద సినిమాలకు కష్టం: 2023 టాలీవుడ్ ట్విస్ట్స్

Advertiesment
Walther veerayya
, గురువారం, 21 డిశెంబరు 2023 (18:45 IST)
Walther veerayya
ఈ ఏడాది 229  స్ట్రెయిట్ సినిమాలు తెలుగులో విడుదలయ్యాయి. అందులో ఆరు నెలల్లో 110 సినిమాలు విడుదలయ్యాయి. మొదటి ఆరునెలల్లో పెద్ద సినిమాలకు ధీటుగా చిన్న సినిమాలు కొత్తగా సినిమారంగంలో తన టాలెంట్‌ను పరీక్షించుకునే నటీనటులు, దర్శకనిర్మాతల సినిమాలు వున్నాయి. చిన్న సినిమాల విజయాలు ఎక్కువగా వున్నా వాటిల్లో చాలామటుకు కథ, కథనం విషయంలో కొన్ని సినిమాలు లోపాలతో నిండి వున్నాయి.

webdunia
Veerasimahreddy
ఇక అగ్ర హీరోల సినిమాలు మెగాస్టార్ చిరంజీవి, రవితేజ నటించిన వాల్తేర్ వీరయ్య, బాలక్రిష్ణ సింగిల్ నటించిన వీరసింహా రెడ్డి చిత్రాలు సంక్రాతికి విడుదలై విజయాన్ని చవిచూశాయి. ఈ రెండు సినిమాల్లో కథ కొత్తది కాకపోయినా స్టార్ ఇమేజ్‌కు తగినట్లుగా పాటలు, యాక్షన్ సన్నివేశాలు ఎక్కువగా వున్నాయి. అయినా ప్రేక్షకులు బాగానే ఆదరించారు. ఇక సమంత శాకుంతలం సినిమా కనీసం రెండు రోజులు కూడా ఆడకుండా తీవ్ర నిరాశను మిగిల్చింది.
 
webdunia
Balagam
ఔత్సాహిక నటీనటులు, సెకండ్ గ్రేడ్ హీరోలు, షార్ట్ ఫిలింస్ నుంచి వచ్చిన నటీనటులు, వెబ్ సిరీస్ ఫ్లాట్‌ఫాంగా వెలిసిన కొత్త తరం ఈ ఏడాది వెండితెరకు పరిచయం అయ్యారు. అందులో ఏడాది ప్రారంభంలో విడుదలైన దోస్తాన్, ప్రత్యర్థి, కాశీకి ప్రయాణం, మైఖేల్ గ్యాంగ్, కళ్యాణం కమనీయం, సింధూరం, వేట, వాలెంటైన్ నైట్ వంటి సినిమాల్లో కొత్త తరం తమ ప్రతిభను వెలిబుచ్చినా వారికి అంత ఆదరణ లేకపోయింది.
 
webdunia
Agent
సందీప్ కిషన్ సక్సెస్ కోసం వేచి చూసి మైఖేల్ అంటూ సరికొత్తగా వచ్చినా ఆయనకు విజయం దక్కలేదు. కొత్తగా వచ్చిన కలర్ ఫొటోతో నటుడిగా అమాయకపు పాత్రతో వచ్చిన సుహాస్ రైటర్ పద్మభూషణ్‌గా పలుకరించి పాస్ అయ్యాడు. ఆ సినిమాతో ఇటీవలే దిల్ రాజు బేనర్లో ఓ సినిమా చేసే స్థాయికి చేరడం విశేషం.
 
ఇక ఆ తర్వాత వచ్చిన ప్రేమదేశం, సువర్ణ సుందరి, బుట్టా బొమ్మ,పాప్ కార్న్,  దేశం కోసం, అల్లంత ధూరణ, I PL (దాని స్వచ్ఛమైన ప్రేమకథ), చెడ్డిగాంగ్ - తమాషా, ఎఫ్ఐఆర్, వినరో భాగ్యము విష్ణు కథ, వూ అంటారా మామా వుహు అంటారా, శ్రీదేవి శోభన్ బాబు, మిస్టర్ రాజు, కోన సీమ థగ్స్, గడువు, రిచిగాడి పెళ్లి, సాచి చిత్రాలు ఏ మాత్రం ప్రేక్షకులకు రుచించలేదు. కొన్ని సినిమాలు వారం ఆడితో మరికొన్ని వారం లోపు ఆడడం విశేషం.
 
webdunia
Viroopaaksha
ఈ తరుణంలో  అమిగోస్ అంటూ నందమూరి కళ్యాణ్ రామ్ సరికొత్త ప్రయోగం చేశాడు. భిన్నమైన పాత్రలు వేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అధి భారీ విజయాన్ని సాధించలేకపోయింది. అయినా పట్టదలతో ఈ డిసెంబర్  29 న  డెవిల్ అంటూ అమెరికన్ గూఢచారి పాత్రతో ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమా ట్రైలర్ సరి కొత్తగా అభిమానుల్ని అలరించింది.
 
ఇవన్నీ ఒక భాగమైతే హాస్య నటుడిగా అందరికీ పరిచయమైన వేణు ఒక్కసారిగా దర్శకుడిగా మారి బలగం సినిమాతో షాక్ ఇచ్చాడు. ఫక్తు తెలంగాణ నేపథ్యం, మనిషి చనిపోయాక గ్రామాల్లో వున్న ఆచారాన్ని 11 కార్యక్రమంలో ఓ కథగా రాసుకుని కథనంతో ఆకట్టుకుని పలు అవార్డులను సొంతం చేసుకోవడమేకాకుండా దిల్ రాజు కుటుంబానికి చెందిన పిల్లలు నిర్మాతలుగా మారి రూపాయికి పది రూపాయలు వచ్చేలా చేసింది. ఈ విజయంతో మరోసారి దిల్ రాజు తన బేనర్లో వేణుకు కొత్త సినిమా ఇవ్వబోతున్నాడు.
 
మరోవైపు చాలాకాలం విరామం తీసుకున్న సీనియర్ దర్శకుడు ఎస్.వి. క్రిష్ణా రెడ్డి ఇప్పటి ట్రెండ్‌కు తగినట్లుగా సినిమా తీయాలని, కటుుంబమంతా కలిసి చూసే చక్కటి హాస్య చిత్రాన్ని రూపొందించాలని బిగ్ బాస్ ఫేమ్ సోహైల్‌తో ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా తీసి పాత చింతకాయ పచ్చడి దర్శకుడు అనే బిరుదును సంపాదించుకున్నాడు. దాంతో సోహైల్‌కు కెరీర్‌కు స్పీడ్ బ్రేకర్ పడినట్లయంది.
 
ఆ తర్వాత వచ్చిన గ్రంథాలయం, CSI సనాతన్, వాడేవాడు, శ్రీ కళ్యాణ్, టాక్సీ, దోచేవారెవరురా వంటి సినిమాలు ఏమాత్రం ఫలితం ఇవ్వలేకపోయింది. అదే టైంలో తనకూ ఓసక్సెస్ కోసం ఎదురు చూస్తున్న నాగశౌర్యకు ఫలానా అబ్బాయి.. ఫలాన అమ్మయి.. అంటూ వచ్చినా పలితం చేకూరలేదు. దాస్ కా ధమ్కీ, అంటూ మాస్ సినిమాతో ద్విపాత్రాభినయం చేసి మెప్పించి పర్వాలేదు అనిపించాడు. 
 
webdunia
Rangamarthanda
ఇదే టైంలో తాను మరలా ముందుకు వస్తున్నానంటూ దర్శకుడు క్రిష్ణ వంశీ వచ్చి రంగ మార్తాండ, అనే సినిమా చేశాడు. ఆ సినిమా మాత్రుక మరాఠీ బాగానే ఆడినా తెలుగులో పెద్దగా ఆదరణ పొందలేదు. రంగస్థలం నటుడు జీవితాన్ని ఆవిష్కరించానని దర్శకుడు చెప్పినా డ్రామా ఎక్కువ కావడంతో ఇప్పటి జనరేషన్‌కు ఎక్కలేదు.  ఇంకోవైపు తనకు ఆరోగ్యం సహకరించకపోయినా అంతకుముందు నటించిన శాకుంతలంతో సమంత ముందుకు వచ్చింది. దర్శకుడు గుణ శేఖర్ చేసిన ప్రయోగం వికటించింది. కనీసం రెండు రోజులు కూడా సినిమా ఆడకపోవడం ట్రాజిడీగానే మిగిలింది. 
 
ఇక ఆ తర్వాత కిరణ్ అబ్బవరం ఈసారి మీటర్‌తో తన స్పీడ్ పెంచాలని చూశాడు. కానీ ఆయన స్పీడ్‌కు ప్రేక్షకులు చేరుకోలేకపోయారు. ఇంక గీత సాక్షిగా, రాజ్ కహానీ, పరారి, దసరా, వీర ఖడ్గం, దహనం, సత్యం వధ ధర్మం చరా,  B & W వంటివి వచ్చినా ఏమీ వర్కవుట్ కాలేదు.
 
రవితేజ పక్కా ప్లాన్‌తో రావణాసురుడుగా వచ్చాడు. కానీ ఆ సినిమాలో శృంగారం పాలు ఎక్కువగా వుండడంతో ఆయనపై పెద్ద ముద్ర పడింది. ఆ తర్వాత టైగర్ నాగేశ్వరరావు అంటూ వచ్చాడు. అదీ పెద్దగా ఫలితం చేకూర్చలేకపోయింది.
 
ఇదే టైంలో యాక్సిడెంట్‌తో ప్రాణాలు నిలబెట్టుకున్న సాయితేజ్ ఈసారి విరూపాక్ష చేసి సక్సెస్‌ను కొట్టాడు. కథ, కథనం బాగాఆకట్టుకుని ప్రేక్షకులను భయపెట్టించేలా చేశాడు. ఇంకోవైపు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అక్కినేని అఖిల్‌కు ఏజెంట్ సినిమా డిజాస్టర్‌గా మారింది. ఇవి ఇలా వుండగా,  హలో..మీరా, రెండు ఆత్మలు, 10 రూపాయలు, కలియుగ భగవాన్, రారా పెనిమిటి, విద్యార్ధి, రామ బాణం, ఉగ్రం, యాదగిరి & సన్స్, కళ్యాణమస్తు, కస్టడీ, సంగీత పాఠశాల, కదా వెనుక కధ, టీ విరామం, భువన విజయం, అన్నీ మంచి శకునములే సినిమాలు కూడా ఏ మాత్రం ఆడలేదు. హసీనా, అడ్డా తీగల, గ్రే, భారత హీరో, మెంటూ చిత్రాల పరిస్థితి కూడా అలాగే మారింది.
 
ఈ ఏడాది ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే సీనియర్ నరేష్, పవిత్రల లవ్ స్టోరీని మళ్లీ పెళ్లిగా తీస్తే ప్రేక్షకులు రిజక్ట్ చేసేశారు. పబ్లిసిటీ ఖర్చులు కూడా రాబట్టలేకపోయింది. నేనూ స్టూడెంట్ సర్, అహిమ, చక్రవ్యూహం, IQ, పరేషాన్, అభిలాష, బంగారు తెలంగాణ, విశ్వవిద్యాలయ, విమానం, పోయే.. ఏనుగు..పొయే, కౌశిక్ వర్మ దమయంతి, ఇంటింటి రామాయణం ఆపలేని మహిషాసురుడు, బైరన్‌పల్లి, అనంత సినిమాలు ఏ మాత్రం ఆదరణ పొందలేకపోయాయి. 
 
విశేషం ఏమంటే,  రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఆదిపురుష్ డిజాస్టర్‌గా మారడం. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణంపై చేసిన ప్రయోగం బెడిసి కొట్టింది. పుస్తకాల్లో, పురాణాల్లో లేని కొత్త రావణాసురుడిని ఇందులో చూపించడం వికటించింది. యాధృచ్ఛికంగా ఈ ఏడాది చివరిలో సలార్ అంటూ కెజి.ఎఫ్. ఫార్మెట్లో రాబోతున్న ప్రభాస్ సినిమా ఏమేరకు సక్సెస్ ఇస్తుందో చూడాలి.
 
రాముడు కాదు కృష్ణుడు, మనుచరిత్ర, భీమదేవర పల్లి బ్రాంచ్, కర్ణ, జాగ్రత బిడ్డ, భారీ తారాగణం, SPY, సామాజవరగమన, మాయపేటిక, లవ్ యు రామ్, నారాయణ అండ్ కో, గండ వంటి సినిమాలు పేరు తెలిసేలోపే థియేటర్ల నుంచి మాయమయ్యాయి. మొత్తంగా చూస్తే  వేల కోట్ల రూపాయలు ఈ ఏడాది నిర్మాతలకు చేదు అనుభవాన్ని ఇచ్చిందనే చెప్పాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్లయి వారం కూడా కాలేదు... నవదంపతులు గోదావరిలో దూకేశారు..