యువతీ యువకుల మధ్య చిగురించే ప్రేమకు అన్ని రకాల ప్రేమల కన్నా బలం చాలా ఎక్కువ. ఎందుకంటే యవ్యనం తొలి సంధ్యలో ఎదుటివారిపై కలిగే ప్రేమ అనే ఆకర్షణ యువతలో పెనుమార్పులకు దారితీస్తుంది. తొలిసారి చూపుకే ఎద తలుపులు తట్టి లోపలికి ప్రవేశించే ఈ ప్రేమభావం యువతను ఆకాశంలో తేలిపోయేలా చేస్తుంది. ఒక్కసారి ప్రేమభావం తనలోకి అడుగు పెట్టిందంటే చాలు అప్పటివరకు మామూలుగా ఉన్న వారు సైతం సప్త వర్ణాలు తమలో ఉదయించినట్టుగా అదో వింతలోకంలో విహరిస్తూ ఉంటారు. ఈ విషయంలో అబ్బాయిల పరిస్థితి మరీ వింతగా ఉంటుంది. తనచుట్టూ ఉన్నవారు తన గురించి ఏమనుకుంటున్నారో అన్న విషయాన్ని పక్కనబెట్టి తానూ తన ప్రేయసి మాత్రమే ఉండే ఆ అద్భుత లోకాన్ని గురించి ఆలోచిస్తూ అలా రోజులు, నెలలు గడిపేస్తుంటారు. |
ప్రేమ మొదలైన తొలి ఏడాదిలో అమ్మాయిపై ఉండే ఆకర్షణ రెండో ఏడాది ఉండదు. అలాగే మరో ఏడాది గడిస్తే ఆ వ్యామోహం మరికాస్త తగ్గుతుంది. |
|
|
అబ్బాయిలోని ఈ ప్రేమ భావానికి అటు పక్కనుంచి అమ్మాయి ఆమోదం కూడా లభించిందంటే ఇక అబ్బాయి ఆనందానికి పట్ట పగ్గాలుండవు. రోజు మొత్తం అదే ధ్యాసతో గడిపేస్తూ ఒక్కోసారి జీవితాన్ని సైతం విస్మరిస్తుంటారు. అయితే ఇంతలా అతనిలో మార్పులకు గురైన ప్రేమ ప్రభావం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుందా అంటే ఖచ్చితంగా అది అనుమానాస్పదమే.
ఎందుకంటే వయసు పొంగులో చిగురించే ప్రేమభావం రోజులు గడిచే కొద్దీ తన ప్రభావాన్ని కోల్పోతుంది. అందుకే ప్రేమ మొదలైన తొలి ఏడాదిలో అమ్మాయిపై ఉండే ఆకర్షణ రెండో ఏడాది ఉండదు. అలాగే మరో ఏడాది గడిస్తే ఆ వ్యామోహం మరికాస్త తగ్గుతుంది. అలా మరి కొన్నేళ్లు గడిచేసరికి జీవితంలో ఎప్పుడూ విడిపోమంటూ ప్రగల్భాలు పలికిన వారు సైతం తమ ప్రేయసి నుంచి విడిపోయి వారిని గురించి తలపులే లేకుండా బ్రతికేస్తుంటారు.
అందుకే టీనేజ్ వయసులో అడుగుపెట్టే ప్రేమలు జీవితాంతం కలిసి కొనసాగే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే టీనేజ్ వయసులోనే ప్రేమలో పడ్డా కూడా కొందరు తమ జీవిత గమనానికి ప్రేమ అడ్డంకిగా మారకుండా చూసుకోగల్గుతారు. ఇలాంటివారు మనసులో ప్రేమభావం ఉన్నా దానికోసం విలువైన కాలాన్ని వృధా చేయకుండా ముందు జీవితంలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారు. అటుపై తమ ప్రేమను సైతం జీవితాంతం నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి వారి సంఖ్య చాలా తక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు. అయితే జీవితంలోని ఏ వయసులో ప్రేమ చిగురించినా దాన్ని జీవితాంతం కాపాడుకోవాలంటే మాత్రం ప్రేమలో ఖచ్చితంగా నిజాయితీ ఉండాలి. ప్రేమలో నిజాయితీగా వ్యవహరించగల్గినవారు మాత్రమే జీవితాంతం తమ ప్రేమ బంధాన్ని కాపాడుకోగలరు. |
తమ అవగాహనా రాహిత్యానికి ప్రేమ అనే కారణాన్ని సాకుగా చూపి జీవితంలో నష్టపోయే వీళ్లు ఒకవేళ ప్రేమ అనే కారణం లేకున్నా జీవితంలో ఖచ్చితంగా పైకి రాలేరు.
|
|
|
ఇలాంటివారు మనసుకు నచ్చినవారి కోసం అవసరమైంది చేస్తూనే జీవితంలో వృద్ధిలోకి రావడానికి అవసరమైన అన్ని పనులను వాయిదా వేయకుండా చేస్తుంటారు. దీనివల్ల ప్రేమ అనేది వారికి జీవితంలో పైకి ఎదగడానికి ఉపయోగపడే ఓ ఆయుధంగానే పనికి వస్తుంది. ఎందుకంటే చాలామంది ప్రేమ పేరుతో కొన్నాళ్లపాటు ఏలాంటి లక్ష్యం లేకుండా తిరిగేసి చివరకు పరిస్థితి చేయి దాటాక కళ్లు తెరచి ప్రేమలో పడడం వల్లే తన జీవితం ఇలా అయిపోయిందని వాపోతుంటారు.
ఇలాంటివారిని చూచినవారు సైతం ప్రేమలో పడితే ఇక జీవితం నాశనమే అన్న నిర్ణయానికి వచ్చేస్తుంటారు. తమ అవగాహనా రాహిత్యానికి ప్రేమ అనే కారణాన్ని సాకుగా చూపి జీవితంలో నష్టపోయే వీళ్లు ఒకవేళ ప్రేమ అనే కారణం లేకున్నా జీవితంలో ఖచ్చితంగా పైకి రాలేరు.
అయితే ప్రేమ అనేది జీవితంలో భాగమని, దానికోసం ఎలాంటి పనులూ వాయిదా వేయరాదని, ప్రేమను దక్కించుకోవాలంటే జీవితంలో సైతం మంచి స్థితికి ఎదగాలని ఎవరైతే నిజాయితీగా ఆలోచిస్తారో వారుమాత్రం ప్రేమ వల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టపోరు. అంతేకాకుండా ప్రేమ అనే బంధం వారి మనసులో అడుగుపెట్టడం వల్ల దాన్ని కాపాడుకోవడం కోసం జీవితంలో త్వరగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తారు. అందుకే ప్రేమలో సైతం నిజాయితీ ఉంటే జీవితంలో ఎప్పడు కూడా ప్రేమ ప్రతిబంధకంగా మారదు.