అమరావతికి ఆ నలుగురూ రక్షకులు... ఎవరూ ఏమీ చేయలేరు...
ఇప్పుడు రాజధానిలా పేరొందిన అమరావతి అందాలు చెప్పనలవిగావు. దీనిని ఒక్కసారైనా చూడవలసిందే. అమరావతి గుంటూరుకి 32 కి.మీల దూరంలో పవిత్ర కృష్ణవేణి నది ప్రక్కన ఉన్నది. కృష్ణానది ఇక్కడ అమరేశ్వరస్వామి ఆలయానికి అతి సమీపంలో ప్రవహిస్తున్నది. నేడు అమరావతి, ధరణికోట
ఇప్పుడు రాజధానిలా పేరొందిన అమరావతి అందాలు చెప్పనలవిగావు. దీనిని ఒక్కసారైనా చూడవలసిందే. అమరావతి గుంటూరుకి 32 కి.మీల దూరంలో పవిత్ర కృష్ణవేణి నది ప్రక్కన ఉన్నది. కృష్ణానది ఇక్కడ అమరేశ్వరస్వామి ఆలయానికి అతి సమీపంలో ప్రవహిస్తున్నది. నేడు అమరావతి, ధరణికోట అనే పేర్లతో పిలవబడుతున్న ప్రాంతాలే ఆనాటి ధాన్యకటకము. ఈ ప్రాంతము నదీ తీరమగుటచేత సారవంతమైన భూమి ఉన్నందున ఇక్కడ ప్రజలు ఎక్కువుగా నివసించేవారు.
ఇక్కడ శైవ మతాభివృద్ధి చెందింది. అంతేకాదు బౌద్ధ, జైన మతాలు కూడా ఇక్కడ ప్రాచుర్యాన్ని పొందాయి. శాతవాహనుల కాలంలో ఇప్పుడున్న స్తూపప్రాంతములో అతి పెద్ద స్తూపము రమ్యమైన శిల్పాలతో అలరారుతూ ఉంటుంది. అమృత లింగంలో పెద్దముక్క ఇక్కడ ఉండటం వలన అది పెరగసాగింది. అప్పుడు సూర్యుడు మారేడు దళాలతో శివుణ్ణి అర్చించటం వలన పెరగటం ఆగింది.
అంతేగాని శివుణి శిరస్సు మీద మేకు కొట్టడం నిజం కాదంటారు. ఈ ఆలయానికి 3 ప్రాకారాలు ఉన్నాయి. నాలుగు దిక్కులా నాలుగు ధ్వజస్తంభాలు ఉన్నాయి. ఇక్కడ ప్రణవేశ్వర, అగస్తేశ్వర కోసలేశ్వర మెుదలైన శివలింగాలే కాక ఇంకా అనేక దేవతామూర్తులున్నారు. రెండవ ప్రాకారంలో ఉన్న కాల భైరవుడు ఈ క్షేత్రపాలకుడు. మూడవ ప్రాకారంలో నైరుతీలో శ్రీశైల మల్లిఖార్జునుడు, వాయువ్యదిశలో కాశీ విశ్వేశ్వరుడు, ఈ శాన్యంలో చండీశ్వరుడు, ఆగ్నేయంలో శ్రీకాళహస్తీశ్వరుడు ప్రతిష్టించబడ్డారు. శివకేశవులకు భేదం లేదని నిరూపిస్తూ వేణుగోపాలస్వామి ఆలయం కూడా ఈ ప్రాకారంలో ఉంది.
ఆలయంలో మనకు కన్పించే అర్చామూర్తి 10 అడుగుల పొడవు, రెండు అడుగుల వెడల్పు కలిగి తెల్లటి మార్బుల్ రాయిలాగా ఉంటుంది. ఇక్కడ శ్రీ బాల చాముండేశ్వరీదేవి ఆలయం ఉంది. భక్తుల ఈతి బాధల నుండి విముక్తి కలిగించి మనశ్శాంతిని, సుఖసంతోషాలను ఈ తల్లి ప్రసాదిస్తుంది. యుగాల పర్యంతం పంచాక్షరీ మంత్రోఛ్చారణతో పవిత్రమైన ఈ ప్రాంతాన్ని దర్శించినంత మాత్రానే మనలోను నూతన శక్తి ప్రవేశిస్తుంది.