Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమల... చిరుతలు అందుకే వస్తున్నాయ్...

తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమలను రూపొందించాలని ఈవో అధికారులను కోరారు. తిరుమల సుందరీకరణలో భాగంగా శ్రీవారి ఆలయం ముందు భాగాంలో ప్రహరి ఉద్యానవనాల తరహాలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతా

శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమల... చిరుతలు అందుకే వస్తున్నాయ్...
, మంగళవారం, 26 జులై 2016 (19:51 IST)
తిరుమల : శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి భూలోక నందనవనంగా తిరుమలను రూపొందించాలని ఈవో అధికారులను కోరారు. తిరుమల సుందరీకరణలో భాగంగా శ్రీవారి ఆలయం ముందు భాగాంలో ప్రహరి ఉద్యానవనాల తరహాలో తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనంలో, భక్తులు ఎక్కువగా సంచరించే ప్రాంతాలలో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తిరుపతిలోని శ్వేతాలో తితిదే ఉద్యోగులకు పరాకామణి, విడిది, దర్శనం, లడ్డూ, కల్యాణకట్ట, శ్రీవారిసేవ, తదితర అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇవ్వలని సూచించారు. 
 
శిక్షణకు సంబంధించి మాడ్యుల్స్‌ తయారుచేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రూ.300/- శీఘ్ర దర్శనం టికెట్లతో దర్శనం చేసుకున్న భక్తుల నుండి ఫీడ్‌బ్యాక్‌ రిపోర్టు సేకరించాలని అధికారులను కోరారు. దర్శన సౌకర్యాలపై భక్తుల అభిప్రాయం తెలుపవలసిందిగా ఎస్‌.ఎమ్‌.ఎస్‌. పంపాలని ఇడిపి అధికారులను ఆదేశించారు. తిరుమలలో వసతి గృహాలు, తాగునీరు, స్నానానికి వేడినీరు అందుబాటులో ఉంచడంతో పాటు కొళాయిలు, వాష్‌బేషిన్‌లు, విద్యుద్దీపాలు తదితరాల మరమ్మతులను పూర్తిచేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
 
వర్షాకాలం రానుండటంతో డ్రైనేజ్‌ మరమ్మతులు, దోమల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. కల్యాణకట్టలో భక్తులకు మరింత ఉపయోగకరంగా కౌంటర్లు ఏర్పాటు చేయాలని అన్నారు. రూ300/- తరహాలో దివ్యదర్శనం కాంప్లక్స్‌ను త్వరగా పూర్తిచేయాలని ఇంజినీరింగ్‌ ఆధికారులను ఆదేశించారు. 
 
వ‌న్య ప్రాణులు జనావాసంలోకి రాకుండా చర్యలు: 
తిరుమలలో జనవాసాలలోనికి ఇటీవల కాలంలో తరచు చిరుతపులులు వస్తున్న తరుణంలో వసతిగృహాలు వెనుక తితిదే అటవీశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులు సమన్వయంతో పటిష్ఠమైన పెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. భక్తులు, తిరుమలలోని హోటల్స్‌ వారు తినుబండారాల వ్యర్ధాలను లోయలో వేయడం వల్ల, వాటిని తినడానికి వన్య ప్రాణులు వస్తున్నాయని, వీటిని వేటాడేందుకు చిరుత పులులు వస్తున్నట్లు తెలిపారు. కావున భక్తులకు, తిరుమలలోని హోటల్స్‌ నిర్వాహకులకు అవగాహన కల్పించాలని ఆయన ఆరోగ్యశాఖ, విజిలెన్స్‌ అధికారులను ఆదేశించారు.
 
ఈ సమావేశంలో తిరుమల జెఈవో  కె.యస్‌.శ్రీనివాసరాజు, చీఫ్‌ ఇంజినీర్‌  చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఎఫ్‌ఏ అండ్‌ సిఏవో బాలాజి, ఎస్‌ఇ-2 శ్రీరామచంద్రారెడ్డి, ముఖ్య భద్రతాధికారి రవీంద్రారెడ్డి, శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో కోదండరామారావు, ఆరోగ్యశాఖాధికారి ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రావ‌ణ‌ మాసంలో ల‌క్ష్మీదేవికి పూజ ఎందుకు చేయాలి?... ఎలా చేయాలి?