Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రావ‌ణ‌ మాసంలో ల‌క్ష్మీదేవికి పూజ ఎందుకు చేయాలి?... ఎలా చేయాలి?

అందరికి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటాము. నిత్యం లక్ష్మి దేవిని పూజిస్తూనే ఉంటాము, కాని ఆషాఢమాసం తరువాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తే చాల మంచిదని మన పూర్వీకులు అంటారు. ఈ మాసంలో శుక్ర, మంగళ వారాలు ముఖ్యమైనవి. ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారా

Advertiesment
Varalakshmi Vratham
, మంగళవారం, 26 జులై 2016 (15:38 IST)
అందరికి లక్ష్మీ కటాక్షం కావాలని కోరుకుంటాము. నిత్యం లక్ష్మి దేవిని పూజిస్తూనే ఉంటాము, కాని ఆషాఢమాసం తరువాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మి పూజ చేస్తే చాల మంచిదని మన పూర్వీకులు అంటారు. ఈ మాసంలో శుక్ర, మంగళ వారాలు ముఖ్యమైనవి. ఈ నెలలో వచ్చే నాలుగు శుక్రవారాలు కూడా లక్ష్మీ పూజ చేస్తారు. 
 
ఈ పూజని ఎలా చేస్తారంటే… శుక్రవారం నాడు పొద్దుటే లేచి, స్నానం చేసి, ఇల్లంతా శుభ్ర‌పరచుకుని, వాకిట్లో ముగ్గు ట్టుకోవాలి. తరవాత లక్ష్మిదేవికి ఇష్టమైన శెనగలు నాన బెట్టి వాటిని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. శెనగలు అంటే లక్ష్మీ దేవికి చాలా ఇష్టం. ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. పాలతో చేసిన ఏ వంటకమైన లక్ష్మీ దేవికి ఇష్టమే. అందుకే పాలతో పాయసం, పరవాన్నం ఏదైనా పెట్టచ్చు. పూజ గదిలో లక్ష్మీ దేవిని పూలతో చక్కగా అలంకరించి, నైవేద్యం పెట్టి పూజ చేసుకోవాలి. ఎవరినైనా ముత్తైదువును పిలిచి మన శక్తి కొద్ది తాంబూలం ఇవ్వాలి. అయితే నాలుగు వారాలు ఇలా చేసినా, రెండవ వారం వరలక్ష్మి వ్రతం చేస్తారు. 
 
వరలక్ష్మి వ్రతం రోజు అంతా అలానే చేసి, అమ్మవారికి మూడు లేక ఐదు లేక తొమ్మిది రకాల మన శక్తిని బట్టి పిండివంటలు వండి నైవేద్యం పెట్టాలి. ఇక అమ్మవారికి చీర, లక్ష్మీ రూపు, అలంకరణ అన్నీ మన శక్తి మరియు భక్తి మీద ఆధారపడి ఉంటుంది. ఆ రోజు వరలక్ష్మి వ్రత కథను చదువుకుని, తోరణం చేతికి కట్టుకోవాలి. ఇలా పూజ చేసుకుని, ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇవ్వాలి. ఇది పెళ్లి కానివారికి, పెళ్లి అయిన ముత్తైదువులకు కూడా చాలా మంచిది.
 
1. శ్రావణ మాసంలో లక్ష్మీ దేవిని పూజించడం వలన ఆ దేవి చాలా సంతృప్తి చెంది కరుణిస్తుంది.
2. పెళ్లి అయిన వారు ఈ పూజ చేసుకోవడం వలన సౌభాగ్యవంతులుగా వర్ధిల్లుతారు.
3. లక్ష్మీ అనగానే కొందరు ధనము మాత్రమే అనుకుంటారు. ధనము, ధైర్యము, విద్య, ధాన్యము, విజయము, పరపతి, సంతానము, గుణము ఇవన్నీ కూడా మనకి ప్రాప్తం కలగాలని ఆ తల్లిని పూజిస్తాము.
4. శ్రావ‌ణ‌మాసంలో పెళ్ళిళ్ళు కూడా ఎక్కువగా అవుతాయి. కొత్త పెళ్ళికూతురితో అత్తగారు ఈ వ్రతం చేయిస్తుంది. అంటే ఆమెకు పూజలు, వాటి విధానం మరియు వాటి ప్రాముఖ్యత తెలుస్తుంది.
5. ఈ మాసంలో ఈ పూజ చేయడం వలన సకల సంపదలు, సుఖసంతోషాలు కలుగుతాయని ప్రతీతి.
6. ఈ వ్రత కథలో చారుమతికి అనే స్త్రీ అందరితో అణకువగా ఉంటుందని, అత్తమామలను చక్కగా చూసుకుంటుందని అలాంటి స్త్రీకి లక్ష్మీ దేవి కటాక్షం కలిగిందని చెబుతారు. అంటే ఆడవాళ్ళు ఎప్పుడూ వినయంగా ఉంటూ, అత్తమామలను అందరిని ఆదరించాలని, అప్పుడే లక్ష్మీ కటాక్షం ఉంటుందని, కొత్త కోడలికి తెలుస్తుంది.
8. ఏ ఇంట్లో ఆడవాళ్ళు సౌమ్యంగా ఉంటూ, ఇంటిని, ఇంటిల్లపాదిని ప్రశాంతంగా ఉంచుతారో ఆ ఇంట్లో అన్ని మరియు అందరి పనులు విజయవంతం అవుతాయి.
9. అలాగే లక్ష్మీ స్వరూపమైన స్త్రీని, ఏ ఇంట్లో కంటతడి పెట్టనీయక చక్కగా చూసుకుంటారో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని అంటారు.
మన పూర్వీకులు మనకి ఇచ్చిన ప్రతీ పూజలో, సాంప్రదాయాలలో ఎన్నో ఆరోగ్య సూత్రాలు మరియు మనుషుల జీవన శైలికి కావాల్సిన మంచి సూత్రాలు ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అసలు తిరుమల రంగనాయకమండపం అంటే ఏమిటి...?