Publish Date: Thu, 21 Apr 2016 (12:33 IST)
Updated Date: Thu, 21 Apr 2016 (12:34 IST)
ఎట్టి పరిస్థితిల్లోను శ్రీవారి లడ్డూ ధరను పెంచబోమని తేల్చిచెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ చదలవాడ క్రిష్ణమూర్తి. లడ్డూ ధరను పెంచుతామని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారాయన. సామాన్య భక్తులకు తక్కువ రేటుకే లడ్డూను అందించాలన్న ఉద్దేశంతో 25రూపాయలకే లడ్డూలను విక్రయిస్తున్నట్లు చెప్పారు.
ఎపి రాజధాని అమరావతిలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం తరహాలో మరో ఆలయ నిర్మాణాన్ని చేపడతామన్నారు. ఇప్పటికే ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వాన్ని స్థలం మంజూరు చేయమని కోరామన్నారు. కడప జిల్లాలోని ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయాన్ని, చెరువును 30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తామని తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో చదలవాడ క్రిష్ణమూర్తి తెలిపారు.