Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒంటిమిట్ట కళ్యాణాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం : టిటిడి ఛైర్మన్‌

Advertiesment
ttd chairman chadalavada
కడప జిల్లా ఒంటిమిట్ట రాములవారి కళ్యాణోత్సవాన్ని అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా నిర్వహించామన్నారు టిటిడి పాలకమండలి ఛైర్మన్‌ చదలవాడ క్రిష్ణమూర్తి. లక్షమందికి పైగా భక్తులు కళ్యాణోత్సవానికి హాజరైనా ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూశామన్నారు టిటిడి ఛైర్మన్‌. 
 
గవర్నర్‌ నరసింహన్‌, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడులు ఏర్పాట్లపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. వేదపండితుల వేదమంత్రోచ్ఛారణ మధ్య వైభవోపేతం ఆ కళ్యాణాన్ని నిర్వహించామని, కళ్యాణానికి వచ్చిన భక్తులందరికీ ముత్యాల తలంబ్రాలు అందించామన్నారు చదలవాడ క్రిష్ణమూర్తి.

Share this Story:

Follow Webdunia telugu