Publish Date: Tue, 20 Sep 2022 (21:23 IST)
Updated Date: Tue, 20 Sep 2022 (21:30 IST)
తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టీటీడీ ప్రత్యేకంగా ఓ క్యూఆర్ కోడ్‌ను తీసుకువచ్చింది. దీని ద్వారా శ్రీవారి భక్తుల అరచేతిలో తిరుమల రూట్ మ్యాప్ ప్రత్యక్షం కానుంది.
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా తిరుమలలో కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకోవచ్చు. వెళ్లాల్సిన చోటుపై క్లిక్ చేస్తే రూట్ మ్యాప్ వస్తుందని, దాన్ని అనుసరించి వెళితే గమ్యస్థానం చేరుకోవచ్చని టీటీడీ ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు.
టీటీడీ వసతి సముదాయాలు, గెస్ట్ హౌసులు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లు, లడ్డూ కౌంటర్లు, ఆసుపత్రి, పోలీస్ స్టేషన్లు, విజిలెన్స్ కార్యాలయాల వివరాలన్నీ మొబైల్ ఫోన్‌లో కనిపిస్తాయి. తద్వారా కొండపై ఒక చోటు నుంచి మరో చోటుకు వెళ్లేందుకు సులువు అవుతుందని టీటీడీ పేర్కొంది.
సెల్వి
Publish Date: Tue, 20 Sep 2022 (21:23 IST)
Updated Date: Tue, 20 Sep 2022 (21:30 IST)