Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుమలలో పట్టుబడిన వ్యక్తి ఉగ్రవాది... హిందూ దేవాలయాలపై కన్నేశారా?

తిరుమల మతపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. సనాతన హైందవ ధర్మానికి కేంద్రంగా ఉన్న తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షించుకోవాలి. అందుకే తిరుమలలో అన్యమత ప్రచారాన్ని, ప్రార్థనలను నిషేధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అయితే తిరుమలలో అన్యమత ప్రార్థనలు, ప్రచా

తిరుమలలో పట్టుబడిన వ్యక్తి ఉగ్రవాది... హిందూ దేవాలయాలపై కన్నేశారా?
, శుక్రవారం, 27 జనవరి 2017 (19:09 IST)
తిరుమల మతపరంగా అత్యంత సున్నితమైన ప్రాంతం. సనాతన హైందవ ధర్మానికి కేంద్రంగా ఉన్న తిరుమల క్షేత్ర పవిత్రతను పరిరక్షించుకోవాలి. అందుకే తిరుమలలో అన్యమత ప్రచారాన్ని, ప్రార్థనలను నిషేధిస్తూ ప్రత్యేక చట్టం తీసుకొచ్చారు. అయితే తిరుమలలో అన్యమత ప్రార్థనలు, ప్రచారం పేరుతో తరచూ జరుగుతున్న హడావిడి చూస్తుంటే ఇటు మీడియాగానీ, అటు అధికారులుగానీ సంమయనం పాటించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఈ అంశంలో కాస్త ఆచితూచి వ్యవహరించాల్సిన ఆవశ్యతక అవసరమనిపిస్తోంది. అన్యమత ప్రచారం జరుగుతోందని హడావిడి జరిగిన ప్రతిసారీ ఆఖరికి అది దూదిపింజలా తేలిపోతోంది. ఉదాహరణకు మొన్న తిరుమలలో జరిగిన ఉదంతాన్ని పరిశీలిద్దాం.
 
ఎక్కడో కోల్ కత్తాకు చెందిన ఓ ముస్లిం యువకుడు... తిరుమలలో నమాజ్ చేస్తుండగా స్థానికులు గుర్తించి వీడియో తీశారు. ఈ వీడియో మీడియాకు చేరడంతో హడావిడి మొదలైంది. అతను నమాజ్ చేసిన విషయాన్ని ఎవరూ కాదనలేరు. ఆ యువకుడు కూడా అంగీకరిస్తున్నాడు. అయితే తిరుమలలో పరమత ప్రార్థనలు చేయకూడదన్న విషయం తనకు తెలియదని, అందుకే నమాజ్ చేశానని ఒప్పుకున్నాడు. అయినా పోలీసులు అతనిపై అన్యమత ప్రచారం నిషిద్ధ చట్టం కింద కేసు నమోదు చేశారు. వాస్తవంగా అతను ఏదో వ్యాపార నిమిత్తం రేణిగుంటకు వచ్చాడు.
 
అక్కడ తిరుమల బాలాజీ గురించి ఎవరో చెబితే స్వామిని దర్సించకుందామని తిరుమలకు వచ్చారు. తీరా ఆ సమయానికి నమాజ్ వేళ అవడంతో బహిరంగంగానే ప్రార్థన చేశాడు. చట్ట ప్రకారం అతను చేసింది తప్పే. అయితే అతను ఇక్కడి పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో చేశాడో లేక తెలియక చేశాడో అనేది ముఖ్యం. ఎక్కడి నుంచో వచ్చే సామాన్యులకు ఇక్కడి చట్టం గురించి తెలియకపోవచ్చు. అలాంటి అమాయకులకు తిరుమల పద్ధతుల గురించి వివరించి, పంపించి వేయాలి.
 
స్వామిని దర్శించుకునే ఆలోచన ఉంటే డిక్లరేషన్‌ తీసుకుని దర్శనం చేయించి పంపాలి. ఇతర మతాల వారూ శ్రీవారిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతున్నారంటే అది మంచి విషయమే. అవకాశం ఉంటే అలాంటి భక్తులు వచ్చినప్పుడు ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం కూడా చేయవచ్చు. అంతే తప్ప స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చిన వారిపై కేసులు పెట్టడం భావ్యం కాదు. ఆ మధ్య ఇలాంటి హడావిడి ఒకటి జరిగింది. తిరుమల జపాలి తీర్థంలో పాకిస్థాన్ జెండాలు ఉన్నాయంటూ భావించారు.
 
ఇవన్నీ మొదట్లో పోలీసులు అనుకున్నది. ఆ తరువాత అసలు నిజం బయటపడింది. తిరుమలలో అన్యమత ప్రచారం చేసిన వ్యక్తి బంగ్లాదేశ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఇప్పటికే అతను దేశంలోని ప్రధాన హిందూ దేవాలయాలన్నింటినీ తిరిగి రెక్కీ నిర్వహించడానికి తెలుస్తోంది. దీంతో అతన్ని మరింత లోతుగా విచారిస్తున్నారు పోలీసులు. ఇతని వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయం ప్రస్తుతం పోలీసులు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. తిరుమలలో ఒక అన్యమతస్తుడు చొరబడి ప్రార్థన చేయడంతో పాటు ఉగ్రవాది కావడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనీ ప్లాంట్‌ని ఇంట్లో ఎక్కడ ఉంచాలంటే?