Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మనీ ప్లాంట్‌ని ఇంట్లో ఎక్కడ ఉంచాలంటే?

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ధనం బాగా కలిసి వస్తుందని చాలామంది నమ్మకం. అంతేకాదు కొద్దిగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ వాతావరణం ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉంటుందని చెబుతారు. అది ఇంట్లోని వారందరికీ శక్తినీ, అదృష్టాన్ని ఇస్తుందని కూడా కొందరు నమ్ముతారు.

Advertiesment
The Right Direction For Your Money Plant
, శుక్రవారం, 27 జనవరి 2017 (18:55 IST)
మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ధనం బాగా కలిసి వస్తుందని చాలామంది నమ్మకం. అంతేకాదు కొద్దిగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఈ మొక్క చుట్టూ వాతావరణం ఎల్లప్పుడూ పాజిటివ్‌గా ఉంటుందని చెబుతారు. అది ఇంట్లోని వారందరికీ శక్తినీ, అదృష్టాన్ని ఇస్తుందని కూడా కొందరు నమ్ముతారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే మనీ ప్లాంట్ ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదని మన శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
కొన్ని ప్రత్యేకమైన ప్రదేశాల్లో మాత్రమే దాన్ని ఉంచాలని పేర్కొంటున్నాయి. మనీ ప్లాంట్‌ని ఇంట్లో ఈశాన్య దిశలో (ఉత్తరం- తూర్పు మధ్యన) ఉంచరాదు. అలా ఉంచితే ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుంది. ఇంట్లో ఉండేవారి ఆరోగ్యం కూడా బాగోదు. ఈశాన్యం బరువు ఉండాలనే పేరిట పలువురు పూల కుండీని అటువైపు పెట్టడం చేస్తుంటారు. ఇంటిలో ఏదైనా కుండీలో లేదా బాటిల్లో నీళ్లు నింపి అందులో మనీ ప్లాంట్ పెట్టుకోవాలి. దీంతో ఇంట్లో ఉన్నవారి ఆర్థిక స్థితి మెరుగవుతుంది. 
 
మనీ ప్లాంట్‌కు నిత్యం ఎంతో కొంత నీరు పోయాలి. ఇలా చేస్తే ఇంటి పరిసరాలు మొత్తం పాజిటివ్ ఎనర్జీ ఆవహిస్తుంది. ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన ఆకులను ఎప్పటికప్పుడు తొలగించాలి. లేకుంటే ఇంట్లో వాస్తు దోషం ఏర్పడుతుంది. ఇంట్లో ఆగ్నేయ దిశలో (తూర్పు- దక్షిణం మధ్యన) మనీ ప్లాంట్‌ను ఉంచాలి. ఇది వినాయకుడికి ఇష్టమైన దిశ. ఈ క్రమంలో ఆ దిశలో ప్లాంట్‌ను ఉంచితే అదృష్టం బాగా కలిసి వస్తుంది. ఇంట్లోని వారందరికీ శుభం కలుగుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహాభారతంలో హనుమంతుడు ఏం చేశాడో తెలుసా..?