వైకుంఠ ఏకాదశికి తిరుమల రావద్దండి... వస్తే మీ ఇష్టం...
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆ
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి ఇప్పటికే టిటిడి టిక్కెట్లను విడుదల చేసేసింది. ముందుగానే ఆన్‌లైన్‌లో వైకుంఠ ద్వాదశి దర్శనం కోసం 10 వేల టిక్కెట్లను విడుదల చేయడంతో కొద్దిసేపటికే అయిపోయాయ్. ఆన్లైన్‌లో పెట్టడమే ఆలస్యం ఆధార్ కార్డుల జిరాక్స్‌లను జతచేసి ఆన్‌లైన్‌లో కొనేశారు. హాట్ కేక్ లా టిక్కెట్లు అమ్ముడుపోయాయి.
ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టిటిడి వెబ్‌సైట్ టిటిడి ఆర్గ్‌లో టిక్కెట్లను విడుదల చేశారు. కొద్దిసేపటికే భక్తులు అన్ని టిక్కెట్లను కొనేశారు. ద్వాదశి రోజు శ్రీవారిని దర్శించుకుంటే మంచిదన్నది భక్తుల నమ్మకం. అందుకే వైకుంఠ ఏకాదశి, ద్వాదశి రోజున ప్రతి సంవత్సరం రద్దీ ఎక్కువగా ఉంటుంది. నూతన సంవత్సరం రోజే వైకుంఠ ఏకాదశి, ద్వాదశిలు జరుగుతాయి.