Publish Date: Wed, 09 Mar 2016 (09:55 IST)
Updated Date: Wed, 09 Mar 2016 (09:57 IST)
సూర్యగ్రహణం ప్రభావం తిరుమలపై పడింది. ఒక్కసారిగా భక్తుల సంఖ్య తగ్గింది. సూర్యగ్రహణానికి రెండు రోజుల ముందు నుంచే టిటిడి మీడియా ద్వారా ఆలయాన్ని మూసివేస్తామని సమాచారం తెలుపుతూ వచ్చింది. దీంతో భక్తుల రద్దీ తగ్గింది. నిన్న ఉదయం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ శ్రీవారిని 40,613 భక్తులు దర్శించుకున్నారు.
గ్రహణం కావడంతో 6 గంటల నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతించలేదు. 8 గంటల 30 నిమిషాలకు ఆలయ ద్వారాలను టిటిడి మూసివేసింది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.3.01 కోట్లు. సూర్యగ్రహణం ప్రభావంతో తిరుమలలోని రహదారులు ఖాళీగా కనిపిస్తున్నాయి.