Publish Date: Thu, 02 Apr 2026 (11:08 IST)
Updated Date: Thu, 02 Apr 2026 (11:11 IST)
తిరుమల కొండల్లో వెలిసిన పవిత్ర తుంబురు తీర్థ ముక్కోటి ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. దాదాపు 12,235 మంది భక్తులు పాపవినాశనం మార్గం ద్వారా అటవీ ప్రాంతంలో కిలోమీటర్ల మేర నడిచి స్వామివారి తీర్థాన్ని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా తిరుమల కొండల గోవింద నామ స్మరణతో మారుమోగింది. అలాగే హనుమజ్జయంతి రోజున తిరుమల కొండ ప్రకాశించింది. శ్రీనివాసుడు కొలువుదీరిన ఈ తిరుమల దివ్యక్షేత్రంలో రాత్రి వేళ ఎంత మనోహరంగా వుందో చూపే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
ఆకాశం నుంచి చూస్తే తిరుమల గిరులు ఒక వెలుగుల హారంగా గోచరిస్తోంది. ఈ వీడియోలో తిరుమల కొండల పాదయాత్ర మెట్లు కొండలపై వెలిగే లైట్లు అద్భుతంగా దర్శనమిస్తున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు.