Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమలలో పోటెత్తిన భక్తజనం... శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.5 కోట్లు

Advertiesment
tirumala rush
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతం కావడంతో రద్దీ ఒక్కసారిగా పెరిగింది. తిరుమలలోని 26 కంపార్టుమెంట్లు భక్తులతో పూర్తిగా నిండిపోయాయి. ఎక్కడ చూసినా జనం. తలనీలాలు ఇచ్చే కళ్యాణకట్ట వద్ద కూడా భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. విఐపిలు కూడా అదే స్థాయిలో కనిపిస్తున్నారు. విఐపిలు కూడా అధికంగా ఉండడంతో టిటిడి వారికి పెద్దపీట వేయడానికి ఎక్కువ శ్రద్ధను కనబరుస్తోంది.
 
సామాన్యభక్తులను ఎప్పటిలాగే గాలికొదిలేసింది. నిన్న శ్రీవారిని 76,931మంది భక్తులు దర్సించుకున్నారు. ఆదివారం ఉదయానికి 26కంపార్టుమెంట్లలో భక్తులు సర్వదర్సనం కోసం వేచి ఉండగా వారికి 10గంటలకుపైగా దర్సన సమయం పడుతోంది. కాలినడక భక్తులు 10కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి 5గంటలకు పైగా సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 51లక్షల రూపాయలు.

Share this Story:

Follow Webdunia telugu