Publish Date: Tue, 26 Apr 2016 (11:13 IST)
Updated Date: Tue, 26 Apr 2016 (11:14 IST)
ఆపద్భాందవుడు, అనాథరక్షకుడు శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం గంటలోనే భక్తులకు లభిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించినా రద్దీ మాత్రం తిరుమలలో అంతగా కనిపించడం లేదు. తిరుమల కంపార్టుమెంట్లన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 3 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి గంటలోపలే దర్శనం పూర్తవుతోంది.
అలాగే కాలినడక భక్తులు రెండు కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా అదేసమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 70,269 మంది భక్తులు దర్శంచుకోగా హుండీ ఆదాయం రూ.2.72 కోట్లు వసూలైంది.