Publish Date: Fri, 01 Apr 2016 (11:17 IST)
Updated Date: Fri, 01 Apr 2016 (11:18 IST)
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. శుక్రవారం కావడంతో భక్తులు మెల్లమెల్లగా తిరుమలకు చేరుకుంటున్నారు. సాధారణంగా శుక్రవారం సాయంత్రం నుంచి శని, ఆదివారాలలో భక్తుల రద్దీ ఎక్కువగా కనిపిస్తుంటేంది. అదేవిధంగా తిరుమలలో ప్రస్తుతం కూడా కనిపిస్తోంది.
తిరుమల శ్రీవారిని గురువారం 52,397 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.47 కోట్లుగా వచ్చింది. శుక్రవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 6 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి స్వామి దర్శన సమయం 4 గంటలు పడుతోంది.
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లలో వేచి ఉండగా వారికి కూడా శ్రీవారి దర్శనం 4 గంటల సమయం పడుతోంది. శనివారం భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు భావిస్తున్నారు.