Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారి దర్శనం 35 నిమిషాల్లోనే...

Advertiesment
tirumala
కలియుగ వైకుంఠం తిరుమల గిరుల్లో భక్తులే కనిపించడం లేదు. పరీక్షా సమయం కావడంతో భక్తులెవరు తిరుమలకు రావడం లేదు. దీంతో తిరుమల గిరులు బోసిపోయి కనిపిస్తున్నాయి. రోడ్లన్నీ నిర్మానుషంగా మారిపోయాయి. టిటిడి అధికారులు హడావిడిగా వాహనాల్లో తిరుగుతున్నారేగానీ, భక్తుల తాకిడి మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. కంపార్టుమెంట్లన్నీ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. 
 
సర్వదర్శనంకు వెళ్ళే భక్తులతో పాటు కాలినడకన వెళ్ళే భక్తులు నేరుగా కంపార్టుమెంట్ల నుంచి దర్శనానికి వెళ్ళిపోతున్నారు. డైరెక్ట్ లైన్‌గా ప్రస్తుతం తిరుమలలో కొనసాగుతోంది. సర్వదర్శనం, కాలినడక భక్తులకు 35 నిమిషాల్లోనే స్వామివారి దర్శన భాగ్యం లభిస్తోంది. మంగళవారం శ్రీవారిని 45,961 మంది భక్తులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం, కాలినడక భక్తులు ఒక కంపార్టుమెంటులో కనిపించలేదు. మంగళవారం శ్రీవారి హుండీ ఆదాయం 3కోట్ల ఒక లక్ష రూపాయలు వచ్చింది. 

Share this Story:

Follow Webdunia telugu