Publish Date: Wed, 20 Apr 2016 (11:36 IST)
Updated Date: Wed, 20 Apr 2016 (13:00 IST)
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం నాలుగు కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి రెండు గంటలు దర్శన సమయం పడుతోంది.
అలాగే కాలినడక భక్తులు 2 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి రెండు గంటల సమయం పడుతోంది. మంగళవారం శ్రీవారిని 65,600 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.2.44 కోట్లుగా వచ్చింది.