Publish Date: Fri, 22 Apr 2016 (11:23 IST)
Updated Date: Fri, 22 Apr 2016 (11:25 IST)
తిరుమలలో భక్తుల రద్దీ మోస్తారుగా పెరిగింది. ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ప్రకటించడంతో రద్దీ పెరిగినట్లు తితిదే అధికారులు భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం ఐదు గంటల నుంచి సర్వదర్శనం కోసం 10 కంపార్టుమెంటులో భక్తులు వేచి ఉండగా వారికి దర్శన సమయం 5 గంటలు పడుతోంది. కాలినడక భక్తులు 3 కంపార్టుమెంటులో వేచి ఉండగా వారికి 4 గంటల సమయం పడుతోంది.
మరో రెండురోజులు భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉందని తితిదే అధికారులు భావిస్తున్నారు. గురువారం శ్రీవారిని 60,804 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం రూ.1.96 కోట్లుగా వసూలైంది.