Publish Date: Sat, 23 Apr 2016 (11:56 IST)
Updated Date: Sat, 23 Apr 2016 (13:17 IST)
కలియుగ వైకుంఠం తిరుమలలో రద్దీ మోస్తరుగా కొనసాగుతోంది. శనివారమైనా సరే భక్తులు తక్కువగానే తిరుమలలో కనిపిస్తున్నారు. శనివారం ఉదయం 5 గంటల నుంచి సర్వదర్శనం కోసం 7 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా వారికి దర్శనం 4 గంటల సమయం పడుతోంది.
అలాగే కాలినడక భక్తులు 4 కంపార్టుమెంట్లో వేచి ఉండగా వారికి 3 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 66,493 మంది భక్తులు దర్శించుకోగా హుండీ ఆదాయం 2 కోట్ల 22 లక్షల రూపాయలు వసూలైంది.