Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌.. అర్థగంటలోనే దర్శనభాగ్యం

Advertiesment
Tirumala Darshan Direct Line
తిరుమల శ్రీవారి దర్శనానికి డైరెక్ట్ లైన్‌ కొనసాగుతోంది. పరీక్షలు కొనసాగుతున్న నేపథ్యంలో రద్దీ తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. దర్శనానికి వెళుతున్న భక్తులు నేరుగా కంపార్టుమెంటులోకి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో అర్థగంటలోనే స్వామి దర్శన భాగ్యం కలుగుతోంది. 
 
గత రెండు నెలలకు ముందు డైరెక్ట్ లైన్‌ కొనసాగింది. ఆ తర్వాత ఇప్పుడే... సర్వదర్శనంతో పాటు కాలినడకన తిరుమల వెళుతున్న భక్తులు నేరుగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంలో మునిగితేలుతున్నారు. మంగళవారం ఉదయం నుంచి ఈ డైరెక్ట్ లైన్‌ కొనసాగుతోంది. సోమవారం శ్రీవారిని 62,721 మంది భక్తులు దర్శించుకోగా, శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.98 కోట్లుగా ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu